ధోనీ అవసరం లేదు.. కోహ్లీ ఉన్నాడుగా : జడేజా

praveen
ప్రస్తుతం భారత క్రికెట్లో ఏకంగా రెండు ప్రపంచ కప్ ల వీరుడిగా మహేంద్ర సింగ్ ధోనీకి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటివరకు ఏ భారత కెప్టెన్ కూడా మహేంద్ర సింగ్ ధోనీ లాగా రెండు సార్లు ప్రపంచ కప్ గెలిపించింది లేదు. ఈ ఘనత సాధించిన ఏకైక కెప్టెన్ గా ప్రస్తుతం ధోని కొనసాగుతున్నాడు. అయితే ధోని తర్వాత టీమిండియా కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన విరాట్ కోహ్లీ టీమిండియాకు వరల్డ్ కప్ గెలిపించి పెడతాడు అనుకున్నప్పటికీ ఇప్పటివరకు అభిమానులకు నిరాశే ఎదురైంది. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా పలుమార్లు వరల్డ్ కప్ ఆడింది. కానీ చివరికి ఓటమితో నిరాశపరిచింది. దీంతో అటు కోహ్లీ కెప్టెన్సీ పై విమర్శలు రావడం కూడా మొదలయ్యింది.

 కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా వరల్డ్ కప్ సాధించడం కష్టమే..  కెప్టెన్సీ మార్చాల్సిన అవసరం ఉంది అంటూ ఎంతో మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా మరికొన్ని రోజుల్లో టి20 వరల్డ్ కప్ ప్రారంభం కాబోతుంది అనే విషయం తెలిసిందే. ఈ సారి ఎట్టి పరిస్థితుల్లో ప్రపంచకప్ ను ముద్దాడాలి అనుకుంటున్న టీమిండియా..  ఎంతో పకడ్బందీగా ప్లాన్ చేస్తుంది. ప్రస్తుతం భారత క్రికెట్లో రెండు ప్రపంచ కప్ ల వీరుడిగా కొనసాగుతున్న మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలో టీమిండియా ముందుకు సాగితే బాగుంటుందని భావించింది. ఈ క్రమంలోనే ధోనిని టి20 వరల్డ్ కప్ కోసం టీమిండియా మెంటార్ గా నియమించడం గమనార్హం.

 అయితే బిసిసిఐ తీసుకున్న ఈ నిర్ణయంపై అందరూ ఎంతో హర్షం వ్యక్తం చేశారు. ఇక ధోని టీమిండియా కి తోడుగా ఉంటే టీమిండియా కి తిరుగు లేదు అంటూ ఎంతో మంది అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కానీ ఇటీవలే టీమిండియా మాజీ క్రికెటర్ అజయ్ జడేజా మాత్రం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టి20 వరల్డ్ కప్ లో టీమిండియాకు మెంటార్ గా ధోనీని నియమించాల్సిన అవసరం ఏముంది అంటూ ప్రశ్నించారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ కోచ్ రావిశాస్త్రి నేతృత్వంలో జట్టు ప్రదర్శన బాగున్నప్పుడు ఇక మెంటర్ అవసరం ఎందుకు అంటూ ప్రశ్నించాడు. వీడ్కోలు పలకడానికి ముందే విరాట్ కోహ్లీకి ధోని మెంటర్ గా ఉన్నాడని.. ఇక ఇప్పుడు ధోని ని మెంటర్ గా నియమించడం వెనుక ఉద్దేశం ఏంటో అర్థం కావడం లేదు అంటూ  అజయ్ జడేజా షాకింగ్ కామెంట్స్ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: