ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. బెయిర్ స్ట్రో స్థానంలో విధ్వంసకర బ్యాట్స్మెన్?

praveen
క్రికెట్ ప్రేక్షకులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ ప్రారంభానికి ఇంకా ఎన్నో రోజులు లేదు. అటు ఐపీఎల్ రెండవ దశ ప్రారంభానికి సమయం దగ్గర పడుతున్న కొద్దీ అటు ప్రేక్షకుల్లో మరింత ఆత్రుత  పెరిగి పోతూనే ఉంది. ఇక రోజు రోజుకి  ప్రేక్షకులు అందరూ కూడా ఐపీఎల్ రెండవ దశ పై అంచనాలు పెంచుకొంటున్నారు. ఇక ప్రస్తుతం అన్ని జట్లు కూడా ఐపీఎల్లో సత్తా చాటడానికి సిద్ధమవుతున్నాయి.  అయితే ప్రస్తుతం ఐపీఎల్లో డిఫెండింగ్ చాంపియన్ గా కొనసాగుతుంది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు. స్టార్ ఆటగాళ్లు లేకపోయినప్పటికీ ఎంతో అద్భుతంగా రాణిస్తూ  ఇప్పటివరకు రెండు సార్లు టైటిల్ విజేతగా నిలిచింది.

 ఇక ఈ సారి కూడా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు టైటిల్ గెలవాలని కసితో ఉంది అని చెప్పాలి. కానీ  సన్ రైజర్స్ జట్టుకు మాత్రం వరుసగా షాకుల ఎదురవుతూనే ఉన్నాయి. ప్రస్తుతం రెండవ దశ ఐపీఎల్ కు ఎంతో మంది ఆటగాళ్లు వివిధ కారణాల దృష్ట్యా అందుబాటులో ఉండటం లేదు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే హైదరాబాద్ జట్టులో కూడా కీలక ఆటగాడిగా ఉన్న బెయిర్ స్ట్రో దూరం అయ్యాడు.  ఇక ఎన్నో సార్లు అద్భుతమైన ఓపెనింగ్స్ చేసి సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. అలాంటి కీలక ఆటగాడు దూరం కావడంతో ఇక హైదరాబాద్ కి ఊహించని షాక్ తగిలింది అని చెప్పాలి.

 ఇకపోతే అటు విధ్వంసకర బ్యాట్స్మెన్ గా పేరు ఉన్న బెయిర్ స్ట్రో దూరం అయినప్పటికీ అతని స్థానంలో మరో విధ్వంసకర బ్యాట్స్మెన్ ను జట్టులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. బెయిర్ స్ట్రో  స్థానంలో వెస్టిండీస్ క్రికెటర్ షేర్ఫాన్ రూథర్ఫోర్డ్ ను జట్టులోకి తీసుకున్నారు. ఇక ఈ విషయాన్ని సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యం ఇటీవలే ప్రకటించింది. విధ్వంసకర కరేబియన్ ప్లేయర్ షేర్ ఫాన్ ఇప్పుడు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆటగాడు. ఐపీఎల్ రెండో దశ కోసం బెయిర్ స్ట్రో స్థానంలో అతడు టీం లోకి వచ్చాడు అంటూ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యం తెలిపింది. ఇక అదే సమయంలో అటు రూథర్ఫోర్డ్ కి సంబంధించిన గణాంకాలను చెబుతూ ఒక ఫోటో కూడా విడుదల చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: