వరల్డ్ కప్ లో సీనియర్లకు దక్కని చోటు... ఏం పాపం చేశారు ?

VAMSI

టీ 20 వరల్డ్ కప్ కు మరో నెల రోజులు మాత్రమే సమయం ఉంది. అన్ని దేశాల క్రికెట్ బోర్డులు తమ జట్లను ప్రకటిస్తూ వస్తున్నాయి. ఇందులో భాగంగానే సౌత్ ఆఫ్రికా సెలక్షన్ కమిటీ 18 మందితో కూడిన జట్టును రెండు రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న సౌత్ ఆఫ్రికా 3 వన్ డే లు మరియు 3 టీ 20 లు ఆడుతోంది. అయితే ఇప్పటికే ముగిసిన వన్ డే సీరీస్ లో 2-1 తేడాతో సీరీస్ ను శ్రీలంకలో కొల్పోయింది. కాగా నిన్న జరిగిన మొదటి టీ 20 లో సౌత్ ఆఫ్రికా 42 రన్స్ తో విజయాన్ని సాధించింది. ఇదిలా ఉంటే, ప్రకటించిన వరల్డ్ కప్ జట్టులో సీనియర్లుగా గత కొన్ని సంవత్సరాలుగా సౌత్ ఆఫ్రికా టీమ్ అభివృద్ధికి తమ వంతు పాత్ర పోస్తున్న వారిని సెలక్ట్ చేయలేదు.
ఈ నిర్ణయం ఎంతో మందిని చాలా తీవ్రంగా బాధపడుతోంది. వారిలో మాజీ సౌత్ ఆఫ్రికా డైనమిక్ కెప్టెన్ పాఫ్ డూప్లిసిస్, మిస్టరీ సీనియర్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ మరియు అల్రౌండర్ క్రిష్ మోరిస్ ఉన్నారు. వీరిలో డూప్లిసిస్ ఫిబ్రవరి లోనే టెస్ట్ క్రికెట్రి కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతే కాకుండా వైట్ బాల్ క్రికెట్ లో తన సేవలను అందించడానికి ఈ నిర్ణయాన్ని తీసుకున్నానని తెలిపాడు. అయినప్పటికీ సౌత్ ఆఫ్రికా గత డిసెంబర్ నుండి జరిగిన ఏ వైట్ బాల్ సీరీస్ కి ఆడిన స్క్వాడ్ లోనూ డూప్లిసిస్ ను సెలెక్ట్ చేయకపోవడం గమనార్హం. కానీ దేశవాలీ టీ20 క్రికెట్ లో అమోఘంగా రాణిస్తున్నాడు. ఈ సంవత్సరం జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లలో చెన్నై తరపున నిలకడగానే ఆడుతున్నాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్ లోనూ మంచి ప్రతిభ కనబరిచాడు.
ప్రస్తుతం కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో సెయింట్ లూసియా కింగ్స్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఇందులో  ఒక సెంచరీ సాధించి మంచి ఫామ్ లో ఉన్నాడు. అయినా ఇవన్నీ పట్టించుకోకుండా డూప్లిసిస్ ను వరల్డ్ కప్ కు సెలెక్ట్ చేయకపోవడం ఎవ్వరూ జీర్ణించుకోలేకపోతున్నారు. డూప్లిసిస్ తో పాటుగా, ఇమ్రాన్ తాహిర్ మరియు మోరిస్ లను తీసుకోకపోవడంపై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వారు అభిమానులు ఎంతో నిరాశలో ఉన్నారు. వీరు ఏం పాపం చేశారని అడుగుతున్నారు. కానీ సెలక్షన్ పై ఈ ప్లేయర్స్ ఏమీ కామెంట్ చేయకపోవడం ఆశ్చర్యపడే విషయం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: