రో"హిట్" శ్రమకు ఫలితం దక్కేనా ?

VAMSI
నాలుగవ టెస్ట్ లో ఫలితం తేలడానికి సమయం ఆసన్నమైంది. ఇంకో 90 ఓవర్లలో నాలుగవ టెస్ట్ లో విజేత ఎవరు అనేది తెలిసిపోతుంది. నాలుగవ టెస్ట్ లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ఇండియాకు బ్యాటింగ్ అప్పగించింది. ఇంగ్లాండ్ బౌలర్ల ధాటికి మొదటి ఇన్నింగ్స్ లో 191 పరుగులకే టీమిండియా చాపచుట్టేసింది. అయితే టీమిండియా ఆ మాత్రమైనా స్కోర్ చేసిందంటే కోహ్లీ మరియు శార్దూల్ ఠాకూర్ ల పోరాట పటిమే కారణం. సహచరులంతా పెవిలియన్ బాట పడుతున్న కోహ్లీ బాద్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ ను అందించాడు. ఇక శార్దూల్ బ్యాటింగ్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే..ఇంగ్లాండ్ బౌలర్లపై దెబ్బ తిన్న పులిలా విరుచుకు పడ్డాడు. దీనితో రికార్డు హాఫ్ సెంచరీ మార్కును అందుకున్నాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్ ను సైతం తక్కువ స్కోర్ కే ఆల్ అవుట్ చేసినా 99 పరుగుల లీడ్ కి వెళ్లిపోయింది.

అప్పటికి కేవలం రెండు రోజుల ఆట మాత్రమే పూర్తయింది. మూడవ రోజు రెండవ ఇన్నింగ్స్ ను ప్రారంభించిన భారత్, ఒకరకంగా చెప్పాలంటే డేంజర్ జోన్ లో ఉంది. 99 పరుగుల మొదటి ఇన్నింగ్స్ లోటు తో ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ మరియు రాహుల్ లు ఆచితూచి ఆడారు. సెకండ్ ఇన్నింగ్స్ లో పటిష్టమయిన స్కోర్ చేసి 466 పరుగుల వద్ద ఆల్ అవుట్ అయింది. ఇంత స్కోర్ ను చేయగలిగింది అంటే రోహిత్ శర్మ సూపర్ ఇన్నింగ్స్ కారణం. రోహిత్ శర్మ 127 పరుగులు చేసి ఔటయ్యాడు. రోహిత్ కు రాహుల్ (46), పుజారా (61) మరియు కోహ్లీ (44) ల నుండి చక్కని సహకారం లభించింది.

వీరందరి సహకారంతో రోహిత్ శర్మ రికార్డు సెంచరీని అందుకున్నాడు. మ్యాచ్ ఓడిపోతుందేమో అనుకున్న తరుణం నుండి ఈ రోజు ఖచ్చితంగా గెలుస్తాము అన్న నమ్మకం రావడానికి కారణం రోహిత్ ఇన్నింగ్స్ తేడా. ఇక ఇన్నింగ్స్ చివర్లో పంత్ మరియు శార్దూల్ లు అర్ధసెంచరీలు చేయటంతో 367 పరుగులు భారీ లక్ష్యాన్ని ఇంగ్లాండ్ ముందు ఉంచగలిగింది. ఈ రోజు ఆఖరి రోజులో ఇండియా బౌలర్లు చెలరేగి రోహిత్ శర్మ ఇన్నింగ్స్ కు అర్ధం తెస్తారా అన్నది చూడాలి. బ్యాటింగ్ లో చెలరేగుతున్న శార్దూల్ బౌలింగ్ లోనూ తన ఎంపికకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. సెకండ్ టెస్ట్ హీరో మహమ్మద్ సిరాజ్ ఈ టెస్ట్ లోనూ మ్యాచ్ ను మలుపుతిప్పే స్పెల్ తో చెలరేగుతాడా చూడాలి.


 





మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: