తాలిబన్ల ను పొగుడుతున్న స్టార్ క్రికెటర్ ?

Veldandi Saikiran
ఆఫ్ఘనిస్తాన్ దేశంలో ప్రస్తుతం అతి దారుణమైన పరిస్థితులు నెలకొన్న సంగతి అందరికీ తెలిసిందే. గత పది రోజుల కింద దౌర్జన్యంగా ఆఫ్ఘనిస్థాన్ దేశాన్ని స్వాధీన పరుచుకున్నారు. అప్పటి నుంచి ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు నరక యాతన అనుభవిస్తున్నారు. తాలిబన్లు అమలుపరుస్తున్న నియమాల తో ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు విసిగిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే.. ఆ దేశం విడిచి ఇతర దేశాలకు వలస వెళుతున్నారు అక్కడి ప్రజలు.  అయితే వారిని కూడా కాబూల్ ఎయిర్ పోర్ట్ లో తాలిబన్లు అడ్డుకుంటున్నారు. సరైన పత్రాలు లేవనే సాకుతో... ఎయిర్ పోర్ట్ బయటే ఆపేస్తున్నారు. దీంతో వారికి మరిన్ని కష్టాలు ఎదురవుతున్నాయి.అయితే ఇది ఇలా ఉండగా... తాజాగా ఈ తాలిబన్లను పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది... పొగడ్తలతో ముంచెత్తారు.


 "తాలిబన్లు చాలా పాజిటివ్ కోణంలో ఉన్నారు. మహిళలు ఎవరి పనులు వారు చేసుకునేందుకు తాలిబన్లు అనుమతి ఇస్తున్నారు. తాలిబన్లకు క్రికెట్ అన్నా... క్రికెటర్ల అంటే చాలా ఇష్టం." అంటూ తాలిబన్లను మరియు వారి వ్యవహారశైలిపై అఫ్రిది పాజిటివ్ యాంగిల్ లో స్పందించారు. అయితే తాజాగా తాలిబన్లపై అఫ్రిది చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. అటు అఫ్రిది వ్యాఖ్యలపై నెటిజన్లు కూడా తీవ్రస్థాయిలో మండి పడుతున్నారు. తాలిబన్ల వ్యవహార శైలితో అక్కడి ప్రజలు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే... ఆఫ్రిదీ వారిని పొగడడం పై చిందులు వేస్తుంటారు నెటిజన్లు.


ఆఫ్ఘ నిస్తాన్ ప్రజల కష్టాలు అందరినీ ఆవేదనకు గురి చేస్తుంటే... ఆఫ్గన్ లను పొగడడం ఏంటని... అఫ్రిది పై నెటిజన్లు తీవ్రస్థాయి లో ధ్వజమెత్తారు. అటు పాకిస్థాన్ లోని కొంతమంది కూడా ఆఫ్రిది వ్యాఖ్యలు తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. మహిళలను తాలిబన్లు చిత్రహింసలు చేస్తుంటే... అవి కనబడటం లేదా అని ప్రశ్నిస్తున్నారు. తాలిబన్ల ను మెచ్చుకున్న మాజీ క్రికెటర్  అఫ్రిది.. వెంటనే క్షమాపణ లు చెప్పాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: