నిబంధనలకు విరుద్ధంగా పంత్ గ్లౌస్.. అంపైర్ ఏం చేసాడో తెలుసా?
అలాంటివి చేసిన సమయంలో ఆటగాళ్ళు భారీగా జరిమానా చెల్లించడం లాంటివి కూడా చూస్తూ ఉంటామ్. మరి కొన్నిసార్లు ఇక మైదానంలో ఆటగాళ్లను ఫీల్డ్ అంపైర్లు హెచ్చరిస్తుంటారు. ఇక్కడ భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ రెండవ రోజున ఇలాంటి తరహా ఘటన జరిగింది. మ్యాచ్ సాఫీగా సాగిపోతుంది అనుకుంటున్న తరుణంలో ఫీల్డ్ అంపైర్ కన్నూ అటు ఆ వికెట్లు వెనకాల కీపింగ్ చేస్తున్న రిషబ్ పంత్ గ్లౌస్ పైన పడింది. గ్లౌస్ సహజంగా కాకుండా ఏదో తేడాగా కనిపిస్తుంది అని గమనించాడు. చూస్తే ఇక గ్లౌస్ కి టేపు అతికించి ఉంది అన్న విషయాన్ని గుర్తించాడు.
వెంటనే రిషబ్ పంత్ ని పిలిచి గ్లౌస్ నుంచి టేప్ తీసేయాలి అంటూ హెచ్చరించాడు. సాధారణంగా కీపర్ గ్లౌస్ ఎలా ఉంటుందో దాదాపుగా అందరికీ తెలుసు బొటనవేలు చూపుడు వేలు మాత్రమే జాయింట్ అయి ఉంటుంది. మిగతా మూడు వేళ్ళు లకు సంబంధించిన గ్లౌజ్ సపరేట్ గానే ఉంటుంది. కానీ ఇటీవలే రిషబ్ పంత్ ధరించిన గ్లౌస్ లో మాత్రం బొటన వేలు చూపుడు వేలుతో పాటు అటు ఉంగరం వేలు చిటికెన వేలు కూడా కలిసే విధంగా టేప్ అతికించారు. ఇది గమనించిన ఫీల్డ్ అంపైర్ తొలగించాలి అని సూచించడంతో వెంటనే పంత్ తొలగించాడు. అయితే రిషబ్ పంత్ ఎందుకు టేప్ తొలగించాడు అన్నది మాత్రం అక్కడున్న వారికి చాలా మందికి అర్థం కాలేదు.