సిక్స్ ఎరవేసి.. రోహిత్ వికెట్ కు ఎసరు పెట్టాడు?

praveen
క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో అటు ప్రతి ఒక్క ఆటగాడు కూడా తమదైన వ్యూహంతో ఇక ప్రత్యర్థి ఆటగాన్ని బోల్తా కొట్టించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఎప్పుడు బ్యాట్స్మెన్లను తికమక పెట్టి వికెట్ పడగొట్టాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక ఇటీవల టీమిండియా హిట్ మాన్ రోహిత్ శర్మను ఆస్ట్రేలియా బౌలర్ ఇలాగే టెంప్ట్ చేసి మరీ వికెట్ పడగొట్టాడు. ప్రస్తుతం లార్డ్స్ వేదికగా భారత్ ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతుంది అనే విషయం తెలిసిందే.  రెండో టెస్టులో భాగంగా ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్ లో  భారత జట్టుకు ఆరంభంలోనే ఊహించని ఎదురు దెబ్బలు తగిలాయి.


 రెండో మ్యాచ్ లో నాలుగవ రోజైన నేడు 27 పరుగుల లోటుతో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా  27 పరుగులకే టాప్ ఆర్డర్ మొత్తం కుప్పకూలింది. కేఎల్  రాహుల్ కేవలం ఐదు పరుగులు చేసి వికెట్లు చేజార్చుకున్నారు. ఇక రోహిత్ శర్మ కాస్త దూకుడుగా ఆడినట్లు కనిపించినప్పటికీ కేవలం 21 పరుగులు మాత్రమే చేసి ఇక పెవిలియన్ బాట పట్టాడు. ఇక ఇలా టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు ఇద్దర్ని కూడా ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్ అవుట్ చేయడం గమనార్హం  అయితే ఇక మొదటి నుంచి ఎంతో దూకుడుగా ఆడుతున్న రోహిత్ శర్మ వికెట్ పడగొట్టేందుకు తనదైన శైలిలో వ్యూహాన్ని పన్నాడు ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్.



 టూర్ లో భాగంగా అటు రోహిత్ శర్మ ఎక్కువగా ఫుల్ షాట్ లు ఆడుతున్నాడు   ఇటీవలే మార్క్ బౌలింగ్లో ఫుల్ షాట్ ఆడి ఒక భారీ సిక్సర్ కొట్టాడు రోహిత్ శర్మ.  గంటకు 145 కిలోమీటర్ల వేగంతో వచ్చిన బంతిని సిక్సర్ గా మలచడంలో విజయం సాధించాడు. ఇక ఆ తర్వాత తన వ్యూహాన్ని మార్చిన మర్చి తర్వాత రెండు బంతులు కూడా ఆప్ స్టాంపు వైపుగా విసిరాడు బౌలర్. ఇక ఆ తర్వాత మూడో బంతిని షార్ట్ పిచ్ బంతి గా విసిరాడు. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ ఆ బంతిని కూడా సిక్సర్ గా మలిచే ప్రయత్నం చేశాడు. కానీ బంతి కాస్త బౌన్స్ అయ్యింది అన్న విషయాన్ని మాత్రం గ్రహించలేకపోయాడు. దీంతో చివరికి షాట్ కనెక్ట్ కాకపోవడంతో ఫీల్డర్ చేతుల్లోకి క్యాచ్ ఇచ్చి రోహిత్ శర్మ పెవిలియన్ చేరాడు.  ఇలా ఒక సిక్స్ ఎరవేసి ఏకంగా కీలక వికెట్లు పడగొట్టాడు ఇంగ్లాండ్ బౌలర్ మార్క్ వుడ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: