ఆ హీరో అయితే.. నా బయోపిక్ కి బాగా సెట్ అవుతాడు : నీరజ్ చోప్రా
అయితే బయోపిక్ అన్న తర్వాత కొత్త కథ రాసుకోవాల్సిన అవసరం లేకుండా ఉండడం.. ఇక బయోపిక్ తీయాలనుకున్న వ్యక్తి జీవిత కథలో కొన్ని సినిమాటిక్ మార్పులు చేస్తే సరిపోతు ఉండటంతో ఎంతో మంది దర్శక నిర్మాతలు కూడా బయోపిక్ లు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే క్రీడా రంగం నుంచి కపిల్ దేవ్.. ఎంఎస్ ధోని.. ఇక రాజకీయాల నుంచి జయలలిత ప్రధాని నరేంద్ర మోడీ.. వైయస్ రాజశేఖర్ రెడ్డి.. సినీ రంగం నుంచి మహానటి సావిత్రి సీనియర్ ఎన్టీఆర్ లకు సంబంధించిన బయోపిక్ లు ఇప్పటికే తెరకెక్కి మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇక ఇప్పుడు సరికొత్త బయోపిక్ సంబంధించి టాక్ వినిపిస్తుంది.
ఇటీవలే మెగా క్రీడలు అయినా ఒలింపిక్స్లో భారత వందేళ్ల కల నెరవేరుస్తూ స్వర్ణ పతకాన్ని సాధించిన నీరజ్ చోప్రా బయోపిక్ పై అప్పుడే టాక్ మొదలైంది. ఇక ఇటీవల మీడియా ఏకంగా ఇదే ప్రశ్నను నీరజ్ చోప్రా ని కూడా అడిగింది. ఒకవేళ మీ బయోపిక్ తెరకెక్కిస్తే మీ బయోపిక్ లో ఎవరు నటిస్తే బాగుంటుంది అని అడుగగా ఆసక్తికర సమాధానం చెప్పాడు ఈ బల్లెం వీరుడు. తన బయోపిక్ తెరకెక్కిస్తే రణదీప్ హుడా తన పాత్రలో నటిస్తే బాగుంటుందని లేదా స్టార్ హీరో అక్షయ్ కుమార్ పాత్రలో నటిస్తే బాగా సూట్ అవుతుంది అంటూ చెప్పుకొచ్చారు. అదే సందర్భంలో తాను అక్షయ్ కుమార్ కి పెద్ద ఫ్యాన్ అన్న విషయాన్ని కూడా చెప్పుకొచ్చారు. మరి నీరజ్ చోప్రా బయోపిక్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో భారత వందేళ్ళ కల నెరవేర్చిన ఈ స్వర్ణ వీరుడు కథను బయోపిక్ గా ఎప్పుడు ప్రేక్షకులు చూడబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది.