13 ఏళ్ల తర్వాత కొత్త ఛాంపియన్.. హుస్సేన్ బోల్ట్ తర్వాత?
కనీసం ప్రత్యర్థులు ఉసేన్ బోల్ట్ కి పోటీ కూడా ఇవ్వలేకపోయారు అని చెప్పాలి. అయితే ప్రస్తుతం హుస్సేన్ బోల్ట్ ఒలంపిక్స్ లో పాల్గొనడం లేదు. దీంతో 13 ఏళ్ల తర్వాత ఇక పురుషుల పరుగుల పందెంలో కొత్త ఛాంపియన్ అవతరించాడు. హుస్సేన్ బోల్ట్ లేకపోవడాన్ని బాగా ఉపయోగించుకున్నాడు కెనడా అథ్లెట్ ఆండ్రి గ్రాసి. 200 మీటర్ల పరుగులో మెరిసి స్వర్ణ పతకాన్ని సాధించి.. చిరకాల కలను నెరవేర్చుకున్నాడు. అయితే గ్రాసీ రియో ఒలంపిక్స్ లోనే స్వర్ణ పతకాన్ని గెలవాలి అనుకున్నాడు. ఇక ఈ స్వర్ణ పథకం కోసం ఎంతగానో శ్రమించాడు. కానీ ఆ సమయంలో ఉసేన్ బోల్ట్ వుండడంతో చివరికి గ్రాసీ రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి పరిస్థితి ఏర్పడింది దీంతో స్వర్ణం చేజారి సిల్వర్ మెడల్ దొరికింది.
కేవలం 0.2 సెకండ్ల తేడాతో రెండవ స్థానంలో వచ్చాడు గ్రాసి. ఇక రియో ఒలంపిక్స్ లో మొదటి స్థానంలో హుస్సేన్ బోల్ట్ వచ్చి గోల్డ్ మెడల్ సొంతం చేసుకోగా.. ఇక రెండవ స్థానంలో గ్రాసీ సిల్వర్ మెడల్ సంపాదించుకున్నాడు. కానీ ఇప్పుడు హుస్సేన్ బోల్ట్ లేకపోవడాన్ని బాగా ఉపయోగించుకున్నాడు ఏకంగా ఎక్కడ పొరపాటు చేయకుండా ఒలంపిక్స్ 200 మీటర్ల పరుగుల పందెంలో మొదటి స్థానంలో నిలిచి ఇక స్వర్ణ పథకాన్ని గెలవాలి అనే కల సాకారం చేసుకున్నాడు. నాలుగు రోజుల క్రితం పురుషుల 100 మీటర్ల పరుగు పందెం జరిగింది. దీంట్లో మూడవ స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ఇటీవలే బుధవారం రోజున జరిగిన పురుషుల 200 మీటర్ల పరుగులో 19.62 సెకండ్ లలో గమ్యాన్ని చేరుకుని బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు ఇలా 13 ఏళ్ల తర్వాత టోక్యో ఒలంపిక్స్ లో 200 మీటర్ల పరుగు పందెంలో గ్రాసి కొత్త ఛాంపియన్ గా తెర మీదికి వచ్చాడు.