మొదటి టెస్ట్ లో పట్టుబిగించిన ఇండియా.. తేలిపోయిన ఇంగ్లండ్ !

Veldandi Saikiran
ఇంగ్లాండ్ టీం మరియు టీమిండియా మధ్యాహ్నం మొదటి  టెస్ట్ మ్యాచ్ ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ ట్రెంట్ బ్రిడ్జి వేదికగా జరుగుతోంది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ టీం బ్యాటింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో ఇండియా మెడ బౌలింగ్ కు దిగింది. అయితే టీమ్ ఇండియా బౌలింగ్ దెబ్బకు ఇంగ్లాండ్ ప్లేయర్లు వరుసగా పెవిలియన్ బాట పట్టారు. 65.4 ఓవర్లలో కేవలం 183 పరుగులకు ఇంగ్లాండ్ టీం ఆలౌట్ అయింది.


టాప్ ఆర్డర్ మరియు మిడిలార్డర్ పూర్తిగా విఫలం కావడంతో తో అతి తక్కువ స్కోరుకే మొదటి ఇన్నింగ్స్ ను ముగించింది. ఇంగ్లాండ్ కెప్టెన్ రూట్ 64 పరుగులు, బేర్ స్టౌ 29 పరుగులు చేసి.... జట్టు గౌరవప్రదమైన స్కోర్ ను అందించారు. ఇక ఇది ఇలా ఉండగా భారత బౌలింగ్ విషయానికి వస్తే... అందరూ బౌలర్స్ చాలా చక్కగా సాధించారు. ఫాస్ట్ బౌలర్ బూమ్రా మరియు మహమ్మద్ షమీ ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ లకు చుక్కలు చూపించారు. బూమ్రా నాలుగు వికెట్లు, మహమ్మద్ షమీ మూడు వికెట్లు, సిరాజ్ 1 వికెట్, థకుర్ రెండు వికెట్లు పడగొట్టారు.


 ఇక ఇంగ్లాండ్ ఆల్ అవుట్ అయిన  అనంతరం... టీమిండియా మొదటి ఇన్నింగ్స్ ను ఆరంభించింది. ఓపెనర్లుగా రోహిత్ శర్మ మరియు కేఎల్ రాహుల్ దిగారు. మొదటిరోజు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది టీమిండియా. ఇక ఈ మ్యాచ్... రెండవ రోజు ఆట మధ్యాహ్నం మూడున్నర సమయంలో ప్రారంభం కానుంది. ఇక ఇవాళ జరిగే ఇన్నింగ్స్ టీం ఇండియా కు చాలా కీలకంగా మారనుంది. ఇవాళ్టి ఆటలో దూకుడుగా ఆడి.. మంచి స్కోర్ చేస్తే.. ఇండియా కు గెలుపు అవకశాలు ఉంటాయి. అటు ఇంగ్లండ్ జట్టు ఒత్తిడికి గురి చేసి.. టీం ఇండియా గెలవాల్సి ఉంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: