అరుదైన రికార్డు.. ఒకే మహిళకు 7 పతకాలు?
కానీ ఏకంగా ఇటీవలే జరుగుతున్న ఒలంపిక్స్ లో మాత్రం ఏకంగా ఒకే ఒక్క మహిళ ఏడు పతకాలు సాధించడం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోయింది. ఒక్క మహిళ ఏడు పతకాలు సాధించడమా.. ఇది సాధ్యమవుతుందా అంటారు ఈ విషయం చెబితే ఎవరైనా.. కానీ నిజంగానే ఇటీవలే టోక్యో ఒలంపిక్స్ లో ఇది సాధ్యం అయింది. ఒక మహిళా 7 పతకాలు సాధించి ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోయింది. ఆస్ట్రేలియాకు చెందిన ఎమ్మా మేకీయాన్ ఈ అరుదైన ఘనతను సాధించింది. ఆస్ట్రేలియాకు చెందిన ఎమ్మా మేకీయాన్ అనే స్విమ్మర్ ఇలా ఏడు పథకాలు గెలుచుకుంది.
ఇవాళ జరిగిన 4* 100 మెడ్లే రీలే స్విమ్మింగ్ లో ఆస్ట్రేలియా జట్టు విజయం సాధించింది. ఈ క్రమంలోనే ఇక ఈ స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొన్న ఆస్ట్రేలియా స్విమ్మర్ ఎమ్మా మేకీయాన్ ఏకంగా ఏడు పతకాలు సాధించింది. ఇలా ఒకే ఒక్క ఒలింపిక్స్ లో 7 పతకాలు సాధించిన తొలి స్విమ్మర్ గా అరుదైన రికార్డును సొంతం చేసుకుంది ఆ మహిళ. ఇక ఆ మహిళ సాధించిన 7 పతకాలలో 4 బంగారు పతకాలుఉండగా.. మూడు బ్రాంజ్ పథకాలు ఉండడం గమనార్హం. కాగా 1951లో సోవియట్ కు చెందిన ఒక జిమ్నాస్ట్ కూడా ఒకే ఒలింపిక్స్ లో మూడు పథకాలు గెలవటం గమనార్హం. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఇక ఇప్పుడు మరో మహిళ ఇలాంటి అరుదైన ఘనతను సాధించింది.