ఈ ఆటగాళ్ళకి.. బాగా గ్యాప్ వచ్చిందే?
సాధారణంగా అయితే ఇక యువ ఆటగాడు అన్ని ఫార్మాట్లలో కూడా స్థానం దక్కించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూంటారు. అయితే కొంతమందికి ప్రతిభ ఉన్నప్పటికీ కొన్నిసార్లు అదృష్టం కలిసిరాదు. ఈ క్రమంలోనే ఒక ఫార్మాట్లో టీమిండియాలో చోటు దక్కినప్పటికీ మరొక ఫార్మాట్లో చోటు దక్కడానికి మాత్రం చాలా సమయం పడుతుంది. మరికొంతమందికి ఇక ఒకేసారి టీ20,వన్డే, టెస్టు ఫార్మాట్లో ఆడే అవకాశాలు కూడా సొంతం చేసుకుంటూ ఉంటారు. అయితే ప్రస్తుతం భారత జట్టులో టీ20ల్లో ఎంతో అద్భుతంగా ఆడి తమ ప్రతిభ చాటిన యువ ఆటగాళ్లు కొంతమంది వన్డేల్లో చోటు దక్కించుకోవడానికి మాత్రం చాలా సమయం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఆ ఆటగాళ్లు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. సంజూ శాంసన్.. టీ20ల్లో ఎంట్రీ ఇచ్చి కొన్నాళ్ల పాటు జట్టులో కొనసాగాడు. ఆ తర్వాత నిలకడలేమీతో చివరికి అవకాశాలను కోల్పోయాడు. అయితే టి 20 నుంచి వన్డే ఫార్మాట్లో స్థానం దక్కించుకోవడానికి ఈ ఆటగాడికి ఆరు సంవత్సరాల నాలుగు రోజుల సమయం పట్టింది. ఇక టీమిండియాలో మరో కీలక ఆటగాడైన కృనాల్ పాండ్యా టి-20 అరంగేట్రం చేసినప్పటికీ వన్డేలో చోటు తగ్గించుకోవడానికి రెండు సంవత్సరాల 139 రోజులు పట్టింది. టి20 లో టీమిండియా లోకి అరంగేట్రం చేసిన రాహుల్ చహర్ కి వన్డేలో చోటు తగ్గించుకోవడానికి ఒక సంవత్సరం 351 రోజులు పట్టింది. అంతేకాకుండా స్టార్ ప్లేయర్ లో కొనసాగుతున్న రిషబ్ పంత్ టీ20 లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత వన్డే జట్టులో చోటు దక్కించుకోవడానికి ఒక సంవత్సరం 262 రోజులు పట్టడం గమనార్హం.