ఇండియా - శ్రీలంక సిరీస్.. చివరికి కెప్టెన్ దూరం?

praveen
ప్రస్తుతం యంగ్ టీమ్ ఇండియా జట్టు శ్రీలంక పర్యటనకు బయలుదేరింది. ఈ క్రమంలోనే ఇక శ్రీలంక పర్యటనలో భాగంగా వన్డే టి20 సిరీస్ ఆడబోతున్నది టీమిండియా జట్టు. శిఖర్ ధావన్ యువ ఆటగాళ్లతో కూడిన టీమ్ ఇండియా జట్టుకు కెప్టెన్సీ వహించబోతున్నాడు. అంతేకాదు ఈ జట్టుకి హెడ్ కోచ్గా రాహుల్ ద్రావిడ్ వ్యవహరిస్తూ ఉండడం గమనార్హం.  ఈ క్రమంలోనే శ్రీలంక పర్యటనలో భాగంగా భారత జట్టు ఎలా రాణించబోతుంది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. అయితే అడుగడుగునా శ్రీలంక భారత్ సిరీస్ కి ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఇప్పటికే శ్రీలంక క్రికెట్ బోర్డు  ఆటగాళ్లకు మధ్య వివాదం నడుస్తోంది.



 దీంతో ఇక లంక బోర్డు తెరమీదకు తెచ్చిన కాంట్రాక్టుపై సంతకం చేసేందుకు అటు ఆటగాళ్లు ఆసక్తి చూపడం లేదు. అదే సమయంలో ఇటీవల శ్రీలంక జట్టులో నలుగురు ఆటగాళ్లు వైరస్ బారిన పడటం సంచలనంగా మారిపోయింది. దీంతో ఈనెల 13వ తేదీన ప్రారంభం కావాల్సిన వన్డే సిరీస్ కాస్త 18న ప్రారంభిస్తామని లంక క్రికెట్ బోర్డు తెలిపింది. ఇకపోతే ఇప్పుడు శ్రీలంక భారత్ మధ్య జరగబోయే సర్వీసులకు శ్రీలంక సీనియర్ బ్యాట్స్మెన్  కెప్టెన్ కుశాల్ పెరెరా దూరంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే శ్రీలంక ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన సమయంలో జట్టుకు కెప్టెన్గా వ్యవహరించాడు కుశాల్ పెరెరా. కానీ ఇటీవలే సెంట్రల్ కాంట్రాక్టు విషయంపై అటు లంక బోర్డుతో కుశాల్ విభేధించినట్లు  తెలుస్తోంది.



 అదే సమయంలో అతనికి భుజానికి బలమైన గాయం అయినట్లు సమాచారం. అయితే అతన్ని పరీక్షించిన వైద్యులు దాదాపు రెండు వారాల పాటు విశ్రాంతి అవసరం అని చెప్పారట. దీంతో జులై 18వ తేదీ నుంచి 29వ తేదీ వరకు భారత్ శ్రీలంక మధ్య జరుగబోతున్న వన్డే సిరీస్ కి సీనియర్ క్రికెటర్స్ కుశాల్ పెరెరా దూరంగా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని ఇప్పుడు వరకు అధికారికంగా ప్రకటించలేదు శ్రీలంక క్రికెట్ బోర్డు. అంతేకాకుండా ఇక భారత జట్టుతో తడబడ పోయే లంక జట్టును కూడా ఇంకా ప్రకటించలేదు. దీంతో ఎవరెవరితో లంక జట్టును ప్రకటిస్తుంది అన్నది కూడా ఆసక్తికరంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: