మళ్లీ కిచెన్ లో చేరిన సచిన్.. ఏం చేసాడో చూడండి?
ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ అభిమానులందరికీ ఎంతో దగ్గర గానే ఉంటాడు సచిన్ టెండూల్కర్. ముఖ్యంగా సచిన్ టెండూల్కర్ అప్పుడప్పుడు కొన్ని వెరైటీ వంటలు చేస్తూ నెటిజన్లను ఎంతగానో అలరిస్తూ ఉంటాడు. ఇప్పుడు వరకు ఇలా సచిన్ టెండూల్కర్ వంటలు చేసిన వీడియోలు సోషల్ మీడియాలో ఎన్నోసార్లు వైరల్ గా మారిపోయాయి. ఇక ఇప్పుడు మరో సారి సచిన్ టెండూల్కర్ కిచెన్లో దూరి అదిరిపోయే వంట చేసి అభిమానులందరినీ సర్ప్రైజ్ చేశాడు. అంతేకాదు సరికొత్త లుక్ లో కనిపించిన సచిన్ టెండూల్కర్ ప్రస్తుతం ఈ వీడియోలో అలరిస్తూ ఉన్నాడు. ఇటీవలే దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోయింది.
ఎప్పుడు వంట గదిలో తన ఆత్మీయుల కోసం వంట చేసే సచిన్ మరోసారి కిచెన్లో దూరిపోయాడు. తమ ఆత్మీయుల కోసం మరోసారి చెఫ్ అవతారమెత్తాడు. తాను వండేది ఎవరికీ తెలియదని.. తనకు కూడా అది ఏంటో తెలియదు అంటూ సచిన్ సరదాగా కామెంటరీ కూడా ఇస్తూ వంటకం రెడీ చేశాడు. అంతేకాదు ఇక ఈ వంటకాన్ని చేస్తూనే తన క్రికెట్ టెక్నిక్ ని కూడా వంటకంలో ఉపయోగించాను అంటూ కామెంట్రీ ఇచ్చాడు సచిన్ టెండూల్కర్. అయితే తాను తయారుచేస్తున్న వంటకం పేరేంటి ఇక ఆ వంటకాన్ని ఎవరి కోసం తయారు చేస్తున్నాడు అన్న విషయాన్ని మాత్రం చెప్పలేదు. ఇక ఈ వీడియోని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారిపోయింది.