వామ్మో.. కోహ్లీ ఒక్క పోస్ట్ విలువ ఇన్ని కోట్ల?

praveen
టీమిండియా డేర్ అండ్ డాషింగ్ కెప్టెన్ విరాట్ కోహ్లి కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా నెంబర్ వన్ బ్యాట్స్మన్ గా కొనసాగుతున్నాడు. ఒకసారి మైదానంలోకి దిగాడు అంటే ఎంతో దూకుడుగా కనిపిస్తూ ఉంటాడు విరాట్ కోహ్లి. ప్రస్తుతం మూడు ఫార్మాట్లలో భారత జట్టుకు సారథిగా ఎంతో అద్భుతంగా దూసుకుపోతున్నాడు విరాట్ కోహ్లీ. అయితే కోహ్లీకి అటు కేవలం క్రికెట్ లో మాత్రమే కాదు సోషల్ మీడియా లో ఉన్న క్రేజ్ కూడా అంతా ఇంతా కాదు.



 అప్పటికే విరాట్ కోహ్లీ కి ఒక రేంజ్ లో క్రేజ్ ఉండేది. ఇక అనుష్క శర్మ లాంటి ఒక స్టార్ హీరోయిన్ ని పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరి జంట క్రేజ్ ఒక లెవెల్ లోకి వెళ్ళిపోయింది. ఇక వీరిద్దరూ ఎప్పుడూ  సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. వీరికి సంబంధించిన ఏ అప్డేట్ వచ్చినా అది క్షణాల్లో సోషల్ మీడియాను ఊపేస్తు ఉంటుంది. అయితే విరాట్ కోహ్లీ కేవలం క్రికెట్ లో మాత్రమే కాదు ఎన్నో వాణిజ్య ప్రకటనల్లో కూడా కనిపిస్తూ గట్టిగానే సంపాదిస్తున్నాడు.  ఇక అటు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ ని కూడా బాగా ఉపయోగించుకుంటున్నాడు విరాట్ కోహ్లీ. సాధారణంగా సెలబ్రిటీలు ఏదైనా పోస్టులు పెడితే వారికి కొంత మొత్తంలో ఇక ఆయా సోషల్ మీడియా సంస్థలు చెల్లెస్తూ ఉంటాయి. అయితే అటు భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన పర్సనల్ లైఫ్, క్రికెట్ లైఫ్ కి సంబంధించిన అప్డేట్లను అభిమానులకు చెబుతూనే ఉంటాడు.



 ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ భారత్ నుంచి ఏ క్రికెట్ ఆటగాడికి లేనంత స్థాయిలో ప్రస్తుతం సోషల్ మీడియా సంస్థల నుంచి ఒక్కో పోస్ట్ కి కోట్లల్లో సంపాదిస్తున్నాడట. ఇంస్టాగ్రామ్ లో కోహ్లీ పెట్టిన ఒక్క పోస్టు విలువ ఏకంగా 5.08 కోట్లట.  ప్రస్తుతం భారత క్రికెట్ లో ఏ క్రికెటర్ కూడా ఒక పోస్ట్ కి ఈ రేంజ్ లో డబ్బులు తీసుకోవడం లేదట. అయితే ఇలా సోషల్ మీడియా పోస్టులలో ఎక్కువ మొత్తంలో అర్జీస్తున్న వారిలో ఫుట్బాల్ దిగ్గజం క్రిస్టియన్ రోనాల్డ్ 11.9 కోట్లతో టాప్ లో ఉండగా భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ టాప్ 20 లో ఉండడం గమనార్హం. మొత్తంగా చూసుకుంటే 395 మందితో ఈ జాబితాను హోపర్ హెచ్ క్యూ ప్రకటించింది  అయితే ఈ లిస్టులో అటు విరాట్ కోహ్లీ తోపాటు ప్రియాంక చోప్రా కి కూడా చోటు దక్కడం గమనార్హం

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: