మరో యువరాజ్ అనుకున్నారు.. కానీ కనిపించకుండా పోయాడు?

praveen
మన ఇండియా టీం కి కొత్త ఆటగాడు వచ్చేసాడురోయ్...  ఇక బాదుడే బాదుడు అనుకున్నారు అతను టీమిండియా లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు అందరూ. ఆ ఆటగాడు ఎవరో కాదు శివం దుబే. భారత జట్టులో మంచి ఫాంలో హార్థిక్ పాండ్యా కొనసాగుతున్న సమయంలోనే ఇక పవర్ హిట్టర్ గా శివం దూబే కి హార్దిక్ పాండ్యా స్థానంలో అవకాశం కల్పించారు సెలెక్టర్లు.  ఆ సమయంలో  కొత్త వాళ్లకు ఈ టైంలో ఛాన్స్ ఇవ్వడం అవసరమా అనుకున్నారు అందరు.  కాని ఆ తర్వాత శివం దూబే రాణించిన తీరు చూసి.. bcci సెలక్టర్ల  ఛాయిస్ మెచ్చుకో లేకుండా ఉండలేక పోయారు. 1993 జూలై 26 న ముంబై లో జన్మించిన శివం దుబే.. ఆరు సంవత్సరాల నుంచి క్రికెట్ మీద మక్కువ తో ఆడటం మొదలు పెట్టాడు.




 ఇక ఆ తర్వాత కుటుంబ సమస్యల కారణంగా 14 ఏళ్లకే  శివం దుబే క్రికెట్ కి గుడ్ బై చెప్పాడు. ఆ తర్వాత చదువుకుంటూన్న సమయంలో క్రికెట్ మీద ఆశ చావలేదు.  తన ట్రైనింగ్ కి ఎవరైనా సహాయం చేస్తారేమో అని ఎదురు చూడటం మొదలుపెట్టాడు. ఇక ఆ తర్వాత చిన్నచిన్న టోర్నమెంట్ నుంచి వేగంగా ఐపీఎల్లో రాణించి భారత జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. ఇక భారత జట్టులోకి వచ్చిన నాటి నుంచి ఎక్కడా వెనక్కి తిరిగి చూసుకోలేదు. పవర్ హీటింగ్ తో అటు  మరో అద్భుతమైన క్రికెటర్ వచ్చేసాడు అని అనుకున్నారు అభిమానులు.  కానీ ఆ తర్వాత మాత్రం అదే ఫామ్  కొనసాగించలేకపోయాడు శివమ్ దూబే.



 చివరికి పేలవ ప్రదర్శనతో జట్టులో స్థానం కోల్పోయాడు.   భారత జాతీయ జట్టులోకి ఎంతో నమ్మకంగా తీసుకుంటే ఇక నమ్మకాన్ని వమ్ము చేశాడు. కేవలం ఒకటి రెండు మ్యాచ్ లలో మాత్రమే మెరుపులు మెరిపించి.. ఆ తర్వాత మాత్రం పేలవ ప్రదర్శన చేశాడు. భారీ అంచనాలతో జట్టులోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ చివరికి ఫామ్ కోల్పోయి పూర్తిగా కెరీర్ని నాశనం చేసుకున్నాడు. ఇక శివం దూబే జట్టులోకి వచ్చిన సమయంలో అతని హిట్టింగ్ చూసి మరో యువరాజు లాంటి ఆటగాడు దొరికాడు అని అనుకున్నారు అందరు. కానీ అంచనాలను తలకిందులు చేస్తూ జట్టులో స్థానం కోల్పోయాడు. మరోసారి జట్టులో అవకాశం దక్కించుకోవడం కూడా శివం దూబే కష్టమే అన్నది అర్ధమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: