ఓడిన టీమిండియాకు 5.84 కోట్ల ప్రైజ్ మనీ.. మరి న్యూజిలాండ్ కు ఎంతంటే?

praveen
ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన వరల్డ్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ ఎంతో ఉత్కంఠ భరితంగా సాగింది.  అయితే ఇక మ్యాచ్ లో ముందు నుండి అందరికీ హాట్ ఫేవరేట్గా ఉన్న టీమిండియా చివరికి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో ఓటమి పాలయ్యింది. ఇక గతంలోనే  వరల్డ్ కప్ ని కొద్దిలో మిస్ చేసుకున్న న్యూజిలాండ్ జట్టు.. ఈసారి మాత్రం ఎలాంటి తప్పిదాలు చేయకుండా విశ్వవిజేతగా నిలిచింది. ఇక విశ్వవిజేతగా నిలవాలన్న తమ చిరకాల వాంఛను తీర్చుకుంది. అయితే  ఇటీవలే వరల్డ్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ లో గెలిచిన న్యూజిలాండ్ విన్నర్ కాగా ఓడిన భారత్ రన్నరప్ గా నిలిచాయి.



 అయితే ఇక వర్షం మ్యాచ్ కి అంతరాయం కలిగించడంతో మ్యాచ్ ను మరింత ఉత్కంఠభరితంగా సాగింది. ఇక ఎప్పుడో ముగిసి పోవాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా చివరికి రిజర్వు డే కి చేరుకుంది. ఈ క్రమంలోనే భారత జట్టుకి డ్రా చేసుకునే అవకాశం కూడా లభించింది. కానీ భారత జట్టు బ్యాటింగ్ పూర్తిగా ఫెయిల్   అవ్వటంతో ఓటమిపాలైంది. దీంతో అభిమానులు అందరిని  నిరాశపరిచింది టీమిండియా. ఇక అందివచ్చిన అవకాశాన్ని చేతులారా చేజార్చుకుంది. ఒకవేళ మ్యాచ్ డ్రాగా ముగిసిన కూడా అటు రెండు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తామని ఇప్పటికే ఐసిసి తెలిపింది. కాగా 2019 ఆగస్టు నుంచి ఈ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ జరుగగా ఇక ఇటీవలే విశ్వవిజేత న్యూజిలాండ్ గా నిలిచింది.



 అయితే రన్నరప్గా నిలిచిన భారత జట్టుకి 5.84 కోట్ల ప్రైజ్ మనీ దక్కింది. కాగా ఇక ఫస్ట్ ఐసిసి వరల్డ్ ఛాంపియన్షిప్ విజేతగా నిలిచిన న్యూజిలాండ్ జట్టుకు ఛాంపియన్షిప్ గద తో పాటు 11.67కోట్ల ప్రైస్ మని దక్కింది. ఇక పాయింట్ల పట్టికలో మూడవ స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా జట్టు కి 3.29 కోట్లు.. నాలుగో స్థానంలో ఉన్న ఇంగ్లాండ్ కి 2.56 కోట్లు.. ఐదవ స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా కి 1.46 కోట్ల రూపాయల ప్రైస్ మనీ  దక్కింది.  ఇక ఆరు నుంచి తొమ్మిది స్థానాల్లో నిలిచిన జట్లకు 73 లక్షల చొప్పున ప్రైస్ మనీ దక్కడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: