అప్పుడు ధోని గెలిచాడు.. ఇప్పుడు కోహ్లీ గెలిపిస్తాడా?
అయితే ఒకప్పుడు ధోనీ సారథ్యంలోని భారత జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు విరాట్ కోహ్లీ. ముఖ్యంగా మహిసేన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ నెగ్గడంలో కోహ్లీ పాత్ర ఎంతో కీలమైనదని చెప్పాలి. అయితే ఒకప్పుడు ఐసిసి ఛాంపియన్ ట్రోఫీ గెలుచుకున్న జట్టులో కీలక ఆటగాడిగా ఉన్న కోహ్లీకి ఇప్పుడు భారత జట్టు కెప్టెన్గా ఉన్నారు. ప్రస్తుతం భారత జట్టు ఐసీసీ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ ఆడుతోంది. ఇప్పటివరకు జట్టును ఎంతో విజయవంతంగా ముందుకు తీసుకెళ్ళాడు కెప్టెన్ కోహ్లీ.
అయితే వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో వరుణదేవుడు ఇబ్బందులు పెట్టడంతో చివరికి 1వ రోజు 4వ రోజు ఆట ఒక బంతి కూడా పడకుండానే వాయిదా పడింది. దీంతో ఫలితం కాస్త రిజర్వుడ్ డే కి చేరింది. నేడే ఇక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ ఫలితం తేలిపోతుంది. దీంతో ఒకప్పుడు ధోని చరిత్ర సృష్టించినట్లుగానే.. ఇక ఇప్పుడు కూడా అదే రోజున కోహ్లీ చరిత్ర సృష్టించబోతాడా అని అభిమానులు చర్చించుకుంటున్నారు. అయితే 2013లో కూడా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి వర్షం అంతరాయం కలిగించింది. ఇక ఎవరూ గెలుస్తారో అన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.