మిగతా ఐపీఎల్ టోర్నీ జరిగేది అక్కడేనట?

praveen
ఇటీవల బిసి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభించింది. గత ఏడాది వైరస్ ఉన్న సమయంలో యూఏఈ వేదికగా కఠిన నిబంధనల మధ్య ఐపీఎల్ నిర్వహించినట్లు గానే ఈసారి కూడా భారత్ లో వైరస్ వ్యాప్తి ఉన్నప్పటికీ గతంలో యూఏఈ లో నిర్వహించిన విధంగానే భారత్లో కూడా నిర్వహించాలని భావించింది. అంతా సవ్యంగానే ప్లాన్ చేసింది కానీ ఎక్కడో కరోనా వైరస్ పగ పట్టినట్లు గానే  వ్యవహరించింది. దీంతో ఆటగాళ్లను బబుల్ పద్ధతిలో మ్యాచ్లు నిర్వహించినప్పటికీ చివరికి బబుల్ లోకి కూడా ప్రవేశించింది వైరస్.  ఈ క్రమంలోనే వరసగా అన్ని జట్లకు చెందిన ఆటగాళ్లు కరోనా వైరస్ బారిన పడడంతో చివరికి ఐపీఎల్ వాయిదా వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.



 ఇక కరోనా వైరస్ వ్యాప్తి ఉన్నప్పటికీ ఐపీఎల్ ప్రారంభమైంది అని సంతోషపడిన క్రికెట్ లవర్స్ సంతోషం ఎక్కువ రోజులు నిలవలేదు. ఇప్పటికే సగం వరకు టోర్నీ పూర్తవగా.. మరో సగం మిగిలి ఉంది అనుకుంటున్న తరుణంలో వైరస్ కారణంగా ఐపీఎల్ వాయిదా పడింది. అయితే వాయిదాపడిన మిగత ఐపీఎల్ మ్యాచ్ లను ఎక్కడ నిర్వహిస్తారు అన్నది ప్రస్తుతం ఆసక్తి కరం గా మారిపోయింది. భారత్లో ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతుండటం చూస్తుంటే ఇక ఇండియా లో టోర్ని నిర్వహించడం కష్టమే అని అర్థమవుతుంది. ఇలాంటి నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.



 కరోనా వైరస్ కారణంగా వాయిదా పడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నీ సెప్టెంబరు నెలలో ఇంగ్లాండ్లో నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఐపీఎల్ కు ఆతిథ్యం ఇచ్చేందుకు ఇంగ్లీష్ క్లబ్లు ఎంతగానో ఇంట్రెస్టు చూపిస్తున్నాయట. దీనికి సంబంధించి అటు ఇంగ్లాండుకు చెందిన పలు సంస్థలు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుకు కూడా అప్పీల్ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇక మరికొన్ని రోజులలో జరగబోయే ఈ సమావేశంలో కూడా దీనిపై చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏం జరుగుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: