కరోనా ఎఫెక్ట్.. ఇక టోక్యో ఓలంపిక్స్ కూడా.?
కానీ కరోనా వైరస్ కారణంగా ఈ అనుభూతి ఎక్కడ లేకుండా పోయింది అనే చెప్పాలి. బయో బబుల్ పద్ధతిలో వివిధ రకాల క్రీడలు నిర్వహిస్తున్నప్పటికీ అటు ప్రేక్షకులు మాత్రం స్టేడియంలో ఉండడం లేదు. అయితే ఇప్పటికే వివిధ రకాల క్రీడలను ప్రేక్షకులు లేకుండానే నిర్వహిస్తుండగా ఇక ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే టోక్యో ఒలంపిక్స్ కూడా ప్రేక్షకులు లేకుండానే నిర్వహించే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది. ఇప్పటికే కరోనా వైరస్ కారణంగా ఏడాది పాటు వాయిదా పడుతూ వస్తోంది టోక్యో ఒలంపిక్స్. ఇక జపాన్లో జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్ కు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల తరలివస్తుంటారు.
తమ దేశ క్రీడాకారులను ఎంతగానో సపోర్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మాత్రం అలాంటి అవకాశం లేకుండా పోయింది. కరోనా వైరస్ కారణంగా విదేశీ ప్రేక్షకులు లేకుండానే టోక్యో ఒలంపిక్స్ నిర్వహించాలి అని అటు నిర్వాహకులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా అటు జపనీయులకు అనుమతి ఇవ్వడంపై కూడా త్వరలో నిర్ణయం తీసుకోబోతున్నాము అంటూ చెబుతున్నారు నిర్వాహకులు. ఈ విషయంపై జూన్ లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది అంటూ చెబుతున్నారు. అయితే జూలై 23వ తేదీ నుంచి ఆగస్టు 8వ తేదీ వరకు టోక్యో ఒలింపిక్స్ జరుగనున్నాయి అన్న విషయం తెలిసిందే.