సెహ్వాగ్ ఎడమచేతితో బ్యాటింగ్ చేస్తున్నట్లుగా ఉంటుంది.. పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు..?

praveen
టీమిండియా యువ ఆటగాడు రిషబ్ పంత్ ప్రస్తుతం తన కెరియర్ లోనే అద్భుతమైన ఫామ్ లో  కొనసాగుతున్నాడు అన్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు సరైన ప్రదర్శన చేయలేక తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్న రిషబ్ పంత్  ఇప్పుడు మాత్రం... ఏకంగా  సెంచరీ లు చేస్తూ ప్రశంశలు అందుకొంటున్నాడు. ఈ క్రమంలోనే భారత జట్టులో కీలక పాత్ర పోషిస్తున్నాడు రిషబ్ పంత్. కేవలం బ్యాటింగ్లో మాత్రమే కాదు అటు కీపింగ్ లో కూడా అద్భుత ప్రదర్శన చేస్తూ అందరిని ఔరా  అనిపిస్తున్నాడు. ఇక ఎలాంటి ఒత్తిడి లేకుండా దంచికొట్టుడు  కొడుతున్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.



 సొంతగడ్డపై ఇంగ్లండ్ జట్టుతో జరుగుతున్న టెస్టు సిరీస్లో భాగంగా రిషబ్ పంత్ చేసిన అద్భుత ప్రదర్శన అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మొన్నటివరకు విమర్శలు ఎదుర్కొన్న పంత్ ఇప్పుడు మాత్రం ఏకంగా అద్భుత  ప్రదర్శనతో మాజీ ఆటగాళ్లు అందరిని ఫిదా చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇక టీమిండియా విజయంలో కీలకపాత్ర వహించి టెస్టుల్లో కూడా టీ20 మాదిరిగా ఎంతో వేగంగా సెంచరీ పూర్తి చేసిన రిషబ్ పంత్ పై ప్రస్తుతం ప్రశంసల వర్షం కురుస్తోంది అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎంతో మంది భారతీయ మాజీ ఆటగాళ్లు రిషబ్ పంత్ ప్రతిభ పై ప్రశంసలు కురిపించగా.. ఇక ఇటీవల పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ప్రశంసల వర్షం కురిపించారు.



 రిషబ్ పంత్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు చూస్తూ ఉంటే ఏకంగా వీరేంద్ర సెహ్వాగ్ బ్యాటింగ్ చేస్తున్నట్లుగా అనిపించింది అంటూ పాకిస్థాన్ జట్టు మాజీ కెప్టెన్ ఇంజమామ్ ప్రశంసలు కురిపించారు. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ జట్టు ఎంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఇక్కడ ఒత్తిడికి లోను కాకుండా చెలరేగి పోవడంలో రిషబ్ పంత్ వీరేంద్ర సెహ్వాగ్ ఇద్దరూ ఇద్దరే అని ప్రశంసించాడు. ఇక రిషబ్ పంత్ బ్యాటింగ్ చూసినప్పుడల్లా వీరేంద్ర సెహ్వాగ్ ఎడమచేతితో బ్యాటింగ్ చేస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్. ఇకపోతే ఇటీవలే ఇంగ్లాండ్ జట్టుపై భారత జట్టు సొంత గడ్డపై టెస్ట్ సిరీస్ లో ఘన విజయాన్ని సాధించి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో ఫైనల్లోకి అడుగుపెట్టింది అనే విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: