నేను సెంచరీ చేస్తే.. అతను సంబరాలు చేసుకున్నాడు : అశ్విన్

praveen
భారత జట్టు ప్రపంచంలోనే దృఢమైన జట్టు గా ఉంది అన్న విషయం తెలిసిందే. అయితే భారత జట్టు కేవలం ఒకరు ఇద్దరు ఆటగాళ్ల పైనే ఆధారపడి లేదు సమయం వచ్చినప్పుడు మొదటి నుంచి చివరి వరకు ప్రతి ఒక ఆటగాడు కూడా ఒక సైనికుడిలా పోరాడతాడు అని చెబుతూ ఉంటారు భారత క్రికెట్ లోని మాజీలు.  ఇక కొన్ని కొన్ని సార్లు భారత క్రికెట్ పోరాట పటిమను చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తూ ఉంటుంది. ఇక ఇటీవలే భారత్ ఇంగ్లాండ్ మధ్య రెండవ టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ రెండవ టెస్ట్ మ్యాచ్లో భారత జట్టు అద్భుతంగా రాణించిన తీరు అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.



 బ్యాటింగ్  మొదలుపెట్టిన కొంత సమయం లోనే భారత టాప్ ఆర్డర్ మొత్తం వికెట్ కోల్పోయి పేలవ ప్రదర్శనతో పెవిలియన్ చేరిన నేపథ్యంలో జట్టు కష్టాల్లో పడిపోయింది. ఈ క్రమంలోనే జట్టులోని కీలక బ్యాట్స్మెన్లు అందరూ కూడా పెవిలియన్ చేరడంతో ఇక జట్టును ఆదుకునే వారు ఎవరు అని అందరూ నిరాశ చెందారు. కానీ ఆ తర్వాత జట్టులో స్పిన్నర్లు గా కొనసాగుతున్న వారు సైతం అద్భుతంగా రాణించడంతో భారత్ భారీ స్కోరు చేసింది అనే విషయం తెలిసిందే.  తన స్పిన్ మాయాజాలంతో భారత జట్టులో కీలక ఆటగాడిగా మారిపోయి కీలకమైన వికెట్లను పడగొట్టి భారత విజయంలో ఎప్పుడూ ముఖ్య పాత్ర వహించే రవిచంద్రన్ అశ్విన్ ఇక ఇటీవల బ్యాటింగ్లో కూడా ముఖ్యపాత్ర వహించాడు.


 ఏకంగా ఎవరూ ఊహించని విధంగా అతి తక్కువ బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి ఔరా అనిపించాడు రవిచంద్రన్ అశ్విన్. సెంచరీ పై స్పందించిన అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన బ్యాటింగ్ మెరుగవడానికి కోచ్ విక్రమ్ కారణం అంటూ చెప్పుకొచ్చాడు. తనకు కొత్త టెక్నిక్ లు చెప్పడం వల్లే తాను బాగా రాణించా అంటూ తెలిపాడు అశ్విన్. అయితే గతంలో సెంచరీ చేసిన సమయంలో మరో ఎండ్ లో  ఇశాంత్ శర్మ ఉండేవాడని.. ఇక ఇప్పుడు సిరాజ్  ఉన్నాడు అంటూ తెలిపాడు.  అయితే నేను సెంచరీ చేస్తే సిరాజ్ సంబరాలు చేసుకున్నాడని దీన్నిబట్టి మా మధ్య ఉన్న బంధాన్ని అర్థం చేసుకోవచ్చు అంటూ రవిచంద్రన్ అశ్విన్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: