బీసీసీఐకి ఆ ఆటగాడు గొప్ప ఆస్తి : గంభీర్

praveen
ఐపీఎల్ లో అద్భుతంగా రాణించి బిసిసిఐ సెలెక్టర్లు చూపును ఆకర్షించి ఇక భారత జట్టులో స్థానం సంపాదించుకుని ఎంతగానో క్రేజ్ సంపాదించుకున్నాడు రిషబ్ పంత్. ఇక మొదట్లో  మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కావడం..  ఇక వికెట్ కీపర్ కూడా కావడంతో ఇక భారత క్రికెట్లో ధోని వారసుడు వచ్చేసాడు అంటూ క్రికెట్ అభిమానులు అందరూ కూడా ఎంతగానో ఆనందం వ్యక్తం చేశారు. ఇక రిషబ్ పంత్ కీపింగ్ లో బ్యాటింగ్ లో చేసిన అద్భుత ప్రదర్శన కూడా అందరిని మరింత ఆశ్చర్యానికి గురి చేసింది.  అయితే ఆ తర్వాత మాత్రం రిషబ్ పంత్ అంచనాలను అందుకోలేకపోయాడు అన్న విషయం తెలిసిందే.

 బీసీసీఐ రిషబ్ పంత్ కి ఎన్ని అవకాశాలు ఇచ్చినప్పటికీ అంతగా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఈ క్రమంలోనే రిషబ్ పంత్ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు కూడా వచ్చాయి. ఎంతో మంది మాజీ ఆటగాళ్లు రిషబ్ పంత్ పేలవ ప్రదర్శన పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇక అదే సమయంలో పంత్ ఒక గొప్ప ఆటగాడని.. అతనికి సరైన సమయం రావాలి అంటూ కొంతమంది మాజీలు రిషబ్ పంత్ కి అండగా నిలిచారు అన్న విషయం తెలిసింది. ఇకపోతే ప్రస్తుతం రిషబ్ పంత్ తన కెరీర్లోనే అత్యుత్తమ ఫామ్ లో కొనసాగుతున్నారు.  గత ఏడాది జరిగిన ఐపీఎల్ టోర్నీ నుంచి ఇటీవలే ముగిసిన ఆస్ట్రేలియా పర్యటనలో కూడా అద్భుతంగా రాణించాడు రిషబ్ పంత్.

 ప్రస్తుతం భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో కూడా బాగా రాణిస్తున్నాడు. ఎంతో ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేయడమే కాదు అద్భుతంగా కీపింగ్  నైపుణ్యాన్ని కూడా ప్రదర్శిస్తున్నాడు. ఈ  క్రమంలోనే రిషబ్ పంత్ ప్రతిభ పై ప్రశంసలు కురిపించాడు భారత మాజీ ఆటగాడు గౌతం గంభీర్. భారత క్రికెట్ కు రిషబ్ పంత్ గొప్ప ఆస్తి అంటూ ప్రశంసించాడు. బ్యాటింగ్ బాగా చేయడంతో అదే ఆత్మవిశ్వాసంతో కీపింగ్ కూడా అదరగొడుతున్నాడు అని.. అక్షర్ పటేల్,  అశ్విన్ స్పిన్ బౌలింగ్ లో కీపింగ్ చేయడం చాలా కష్టమని అయినప్పటికీ రిషబ్ పంత్ బాగా కీపింగ్ చేస్తున్నాడు అంటూ గౌతం గంభీర్ వ్యాఖ్యానించారు. ఇక రిషబ్ పంత్ రానున్న రోజుల్లో కూడా ఇలాగే కొనసాగితే ఇక బిసిసిఐకి అతను ఒక గొప్ప ప్యాకేజీ అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: