ఓపెనర్ శిఖర్ ధావన్ పై కేసు నమోదు.. అతని ప్రేమే కారణం..?
ఇక ఇటీవల శిఖర్ ధావన్ తన సోషల్ మీడియా ఖాతాలో ఒక పోస్టు పెట్టగా అది కాస్త వైరల్ గా మారిపోయింది. ఇక ఈ పోస్ట్ శిఖర్ ధావన్‌కు లీగల్ సమస్యలను తెచ్చిపెడుతుంది. ఇటీవలే శిఖర్ ధావన్ వారణాసి లో పర్యటించారు అన్న విషయం తెలిసిందే. ఇక అక్కడ గంగా నదిలో ఒక బోటులో ప్రయాణించిన శిఖర్ ధావన్ ఇక అక్కడ ఉన్న పక్షులకు స్వయంగా తన చేతితో ఎంతో ప్రేమగా ఆహారాన్ని అందించారు. ఈ సన్నివేశాన్ని క్లిక్ మనిపించి ఆ ఫోటో ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారిపోయింది.
ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా శిఖర్ ధావన్ బర్డ్ ఫ్లూ కు సంబంధించిన ఆంక్షలు ఉన్నాయి అన్న విషయాన్ని మాత్రం మర్చిపోయాడు. బర్డ్ ఫ్లూ కారణంగా ఉత్తరప్రదేశ్‌లో పక్షులను పట్టుకోవడం.. చికెన్ గుడ్లు లాంటివి తినడం పై నిషేధ ఆంక్షలు ఉన్నాయి. ఎవరైనా నిబంధనలను ఉల్లంఘించి పక్షులకు దగ్గరగా వెళ్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యింది ప్రభుత్వం. ఈ క్రమంలోనే ఇటీవలే స్వయంగా తన చేతితో పక్షులకు ఆహారాన్ని అందించిన శిఖర్ ధావన్ తీరుతో అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఇటీవలే బర్డ్ ఫ్లూ సమయంలో శిఖర్ ధావన్ స్వయంగా తన చేతులతో నిబంధనలను ఉల్లంఘించి ఆహారం వేసాడని ఓ లాయర్ ఛార్జిషీట్ దాఖలు చేయడంతో ఇక జుడిషియల్ మెజిస్ట్రేట్ శిఖర్ ధావన్ పై కేసు నమోదు చేశారు.