రైనా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
సురేష్ రైనా తీరు పట్ల అసహనం వ్యక్తం చేసిన చెన్నై సూపర్ కింగ్స్ యజమాన్యం అతని పేరును తమ ఆటగాళ్ల లిస్ట్ నుంచి తొలగించింది. దీంతో రైనా మళ్ళీ బ్యాట్ పడతాడా లేదా అనే అనుమానం క్రికెట్ అభిమానుల్లో మొదలైంది. అయితే త్వరలోనే జరిగే సయ్యద్ ముస్తక్ ట్రోఫిలో ఉత్తర ప్రదేశ్ జట్టు కెప్టెన్సీ బాధ్యతలు తీసుకోనున్నట్లు రైనా తాజాగా ప్రకటించాడు. అలానే ఐపీఎల్ 14 సీజన్ లో కూడా ఆడాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. అయితే రైనా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కాంట్రాక్టును వదులుకోవడంతో మళ్ళీ ఐపీఎల్ వేలానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే రైనాను చెన్నై జట్టు తిరిగి కొనుగోలు చేస్తుందా లేకా ఇతర ఫ్రాంచైజీ తరపున రైనా ఆడతాడా చూడాలి మరి.
క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత జమ్మూ కాశ్మీర్ లో క్రికెట్ అకాడమీని ప్రారంభించేందుకు ముందుకొచ్చిన రైనా... ఇటీవలే సెప్టెంబర్ 27న తన 34వ పుట్టినరోజు సందర్భంగా మరో గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. తన కూతురు పేరిట ఉన్న ఎన్జీవో గ్రేసియా రైనా ఫౌండేషన్ తరపున ఉత్తరప్రదేశ్, జమ్ము కాశ్మీర్ , ఎన్సీఆర్లో ఉన్న 34 ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుద్ధ్య, తాగునీటి వసతి సౌకర్యాలు, శానిటైజేషన్ లాంటి మౌలిక వసతులను కల్పించే బాధ్యత తీసుకున్నాడు.