టీమిండియాకు డూ ఆర్ డై మ్యాచ్.. ఏం జరుగుతుందో..?
దీంతో భారత ప్రేక్షకులందరూ లో కూడా తీవ్ర నిరాశ మిగిలిపోయింది, అయితే నేడు ఆస్ట్రేలియాతో రెండో మ్యాచ్ ఆడనుంది భారత జట్టు. ఇక ఈ మ్యాచ్ ప్రస్తుతం భారత జట్టుకు డూ ఆర్ డై మ్యాచ్ కానుంది. ఎందుకంటే ఈ మ్యాచ్లో తప్పనిసరిగా గెలిస్తే సిరీస్పై ఆశలు ఇంకా మిగిలి ఉంటాయి. లేదంటే ఆస్ట్రేలియా గెలిచింది అంటే ఇక మరొక మ్యాచ్ మిగిలి ఉన్నప్పటికీ ఎలాంటి ఉపయోగం ఉండదు. అందుకే ఈ మ్యాచ్ తప్పనిసరిగా గెలవాలని ప్రస్తుతం భారత్ ఎంతో పట్టుదలతో ఉంది. ఇక నేడు జరగబోయే వన్డే మ్యాచ్ లో ఏం జరగబోతుంది అనేది కూడా ప్రస్తుతం అందరి ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
మొదటి వన్డే మ్యాచ్లో భాగంగా భారత్ 66 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది అన్న విషయం తెలిసిందే. వన్డే సిరీస్ మూడు మ్యాచ్ లు ఉండగా రేసులో నిలవాలంటే మాత్రం నేటి మ్యాచ్ లో తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఈ మ్యాచ్ టీమిండియాకు డూ ఆర్ డై మ్యాచ్ గా మారిపోయింది. ఈ మ్యాచ్లో గెలిస్తేనే సిరీస్ అవకాశాలు సజీవంగా ఉంటాయి... అయితే టీమిండియాకు బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్నప్పటికీ బౌలింగ్ పరంగా మాత్రం టీమిండియా కాస్త బలహీనంగా కనిపిస్తుంది కేవలం ఐదుగురు బౌలర్లపై మాత్రమే టీమిండియా ఆధారపడి ఉండడంతో ప్రస్తుతం కష్టతరంగా మారిపోతుంది. ఇక నేడు బరిలోకి దిగే టీమిండియా ఎలా ఆడుతుందో చూడాలి మరి.