ఇలా అయితే.. టీమిండియాకి విజయం కష్టమే : హార్దిక్ పాండ్యా

praveen
ప్రస్తుతం భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల నిన్న ఆస్ట్రేలియా జట్టుతో మొదటి వన్డే సిరీస్ మొదలు పెట్టింది భారత జట్టు. అయితే మొదటి మ్యాచ్లో భారత జట్టు కు తీవ్ర నిరాశ ఎదురైంది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు భారీ స్కోరు భారత జట్టు ముందు ఉంచింది. ఇక ఆ తరువాత బ్యాటింగ్ చేసిన భారత జట్టు స్కోరు ని అందుకోలేక చివరికి పరాజయం పాలైంది అనే చెప్పాలి. ఆస్ట్రేలియా జట్టుకు కనీస పోటీని కూడా ఇవ్వలేకపోయింది భారతజట్టు. దీంతో అభిమానులు అందరూ తీవ్ర నిరాశలో మునిగిపోయారు.

 ఒకనొక సమయంలో ఏకంగా టీమిండియా కనీసం గౌరవప్రదమైన పరుగులు అయిన చేస్తుందా లేదా అని అందరూ ఆందోళనలో మునిగిపోయారు. కానీ ఆ తర్వాత హార్థిక్ పాండ్య క్రీజు  లోకి వచ్చి దూకుడుగా ఆడటంతో టీమిండియా ఒక గౌరవప్రదమైన పరుగులు చేసింది అన్న విషయం తెలిసిందే. అయితే చివరి వరకు టీమిండియా బ్యాట్స్మెన్స్  ఎంతగా పోరాడినప్పటికీ చివరికి ఓటమి చవిచూడక తప్పలేదు. ముఖ్యంగా టాపార్డర్ మొత్తం వెంటవెంటనే వికెట్లు పడిపోవడం టీమిండియాకు ఎంతగానో మైనస్ అయింది అని చెప్పాలి. ఇకపోతే నిన్నటి ఓటమిపై టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

 ఒక జట్టు లో ఐదుగురు బౌలర్లను పెట్టుకొని మ్యాచ్ గెలవడం ఎప్పుడైనా కష్ట తరమైన విషయం అటు భారత ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా వ్యాఖ్యానించాడు. జట్టుకు ఒక్కరే విజయాలను అందించేందుకు అవకాశం ఉండదని అంతేకాకుండా ఒక్కరితోనే ప్రణాళికలు రచించేందుకు కూడా చాన్స్ ఉండదు అంటూ హార్థిక్ పాండ్య చెప్పుకొచ్చాడు. ఇక ఐదుగురు బౌలర్లతో  జట్టు బరిలోకి దిగినప్పుడు కష్టతరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు ఒక బౌలర్ సరిగ్గా బౌలింగ్ వేయనప్పుడు ఆ ఒత్తిడి ఇతర బౌలర్లపై పడుతుంది అంటూ చెప్పుకొచ్చాడు. అందుకే జట్టులో ఆల్ రౌండర్ ఉంటే ఆ భారం కాస్త తగ్గుతుంది అంటూ చెప్పుకొచ్చాడు హార్దిక్ పాండ్యా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: