వామ్మో.. ఒక్క పరుగు ఖరీదు 10 లక్షలు.. పంజాబ్ వాళ్ళని వదులుకోవాల్సిందే..?
ఈ క్రమంలోనే జట్టులో ఆటగాళ్ళ మార్పు చేస్తే తప్పా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ఫేట్ మారదు అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ప్రేక్షకులు. ముఖ్యంగా మ్యాక్స్వెల్, కాట్రేల్ లాంటి ఆటగాళ్లను పంజాబ్ వదిలేస్తే ఎంతో మంచిది అని ఇటీవలే మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా కూడా సూచించారు. అయితే జట్టు యాజమాన్యంతో నమ్మకాన్ని 10.75 కోట్లకు ఆల్ రౌండర్ మాక్స్వెల్ ను కొనుగోలు చేసింది. అంతే కాదు టోర్నీ మొత్తం ఆడే అవకాశాన్ని కూడా ఇచ్చింది. మొత్తం టోర్నీలో మాక్స్ వెల్ ఒక్క సిక్స్ కూడా కొట్టలేక పోయాడు.
అదే సమయంలో గత ఏడాది ఇంగ్లాండ్లో జరిగిన వరల్డ్ కప్ లో వెస్ట్ఇండీస్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ గా రికార్డు సృష్టించిన షెల్డన్ కాట్రెల్ ఐపీఎల్లో పంజాబ్ జట్టు ఏకంగా 8.5 కోట్లకు కొనుగోలు చేసింది. పోటీపడి మరీ ఆటగాన్ని తీసుకుంది. కానీ అతడు కూడా తుస్సు మనిపించాడు. ఏకంగా టోర్నీ మొత్తంలో కేవలం ఆరు వికెట్లు మాత్రమే తీశాడు. ఏకంగా ఒక్క పరుగుకు 10 లక్షల ఖరీదుల మారిపోయింది. రాహుల్ టివాటియా కు ఒకే ఓవర్లో ఏకంగా 5 సిక్సర్లు సమర్పించుకొని తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నాడు. వచ్చే సీజన్లో ఇద్దరు ఆటగాళ్లను పంజాబ్ వదులుకుంటే పంజాబ్ దిశ మారే అవకాశం ఉంటుందని ఇటీవల భారత మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా అభిప్రాయం వ్యక్తం చేశారు.