ఇప్పటి వరకు నేను చూసిన బెస్ట్ క్రికెటర్ అతనే..?

praveen
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ఆట కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్రికెట్ మ్యాచ్ వస్తుందంటే చాలు ప్రేక్షకులందరూ పూనకాలు వచ్చినట్లుగానే ప్రవర్తిస్తూ ఉంటారు. ఇక టీవీలకు అతుక్కుపోయి మరి మ్యాచ్ వీక్షిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ముఖ్యంగా భారత క్రికెట్ ప్రేక్షకులందరూ ఎప్పుడు ఏ మ్యాచ్ జరిగినా ఎంతో ఆదరిస్తూ ఉంటారు. ఇక కేవలం భారత్లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ క్రికెట్ అభిమానులను కలిగి ఉన్న భారత క్రికెటర్ ఎవరు అంటే అందరికీ గుర్తొచ్చే పేరు విరాట్ కోహ్లీ. టీమిండియా  కెప్టెన్గా ప్రస్తుతం విరాట్ కోహ్లీ ప్రస్థానం ఎంతో విజయవంతంగా సాగుతున్న విషయం తెలిసిందే.



 రికార్డుల రారాజుగా పరుగులు యంత్రంగా విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. దిగ్గజ క్రికెటర్ లు సృష్టించిన ఎన్నో రికార్డులను తిరగరాశాడు విరాట్ కోహ్లీ. ఎన్నో సరికొత్త రికార్డులను నెలకొల్పేందుకు   కూడా సిద్ధంగా ఉన్నాడు. అయితే సాధారణంగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెటర్లు విరాట్ కోహ్లీపై ఎంతగానో ప్రశంసల వర్షం కురిపిస్తూ ఉంటారు. ఇక ఇటీవలే మరో మాజీ క్రికెటర్ టీమిండియా డేర్ అండ్ డాషింగ్ కెప్టెన్ విరాట్ కోహ్లీ పై ప్రశంసల వర్షం కురిపించాడు. కోహ్లీ ప్రపంచంలోనే బెస్ట్ క్రికెటర్ అంటూ కితాబు ఇచ్చాడు సదరు మాజీ క్రికెటర్.



 తాను ఇప్పుడు వరకు ఎంతోమంది క్రికెటర్లను చూశానని అయితే తాను చూసిన అందరూ క్రికెటర్లలో కెల్లా భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అత్యుత్తమ ఆటగాడు అంటూ  ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు లాంగర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. కేవలం బ్యాటింగ్ విషయంలోనే కాదు అతని ఎనర్జీ క్రికెట్ ఆట పట్ల అతనికి ఉన్న అంకితభావం.. ఫీలింగ్ చేసే విధానం.. ఇవన్నీ కూడా తనకు ఎంతగానో నచ్చుతాయి అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇక ఇటీవల తాను తండ్రి అయ్యే సమయానికి ఇండియా వెళ్లాలి అనుకోవడం కూడా ఎంతగానో నచ్చిందని చెప్పుకొచ్చాడు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ లాంగర్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: