సిఎస్కే నిర్ణయం.. ముంబైకి వరం అయింది.. కొత్త చరిత్రకు కారణమైంది..?
ఇక ఈ ఏడాది మాత్రం పేలవ ప్రదర్శన చేసి విమర్శలు ఎదుర్కొంటూ ఐపీఎల్ నుంచి నిష్క్రమించిన మొదటగా జట్టుగా రికార్డును సొంతం చేసుకుంది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు. అయితే ఐపీఎల్ చరిత్రలోని అత్యుత్తమ జంటగా గుర్తింపు పొందిన ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య వైరం ఉన్న సంగతి తెలిసిందే. కారణం.. 2011లో ఐపీఎల్ వేలానికి ముందు రోహిత్ శర్మను జట్టులోకి తీసుకోవాలని అభిమానులు చెన్నై సూపర్ కింగ్స్ అడగటంతో.. అతడి కోసం బిడ్డింగ్ చేయబోవు అంటూ స్పష్టం చేసింది జట్టు యాజమాన్యం. ఇక ఆ తర్వాత 2008లో దక్కన్ ఛార్జర్స్ తరపున ఐపీఎల్లో అడుగుపెట్టిన రోహిత్ శర్మ మూడేళ్లపాటు హైదరాబాద్ తరఫున ఆడాడు.
ఇక 2013 నుంచి ముంబై ఇండియన్స్ కొనుగోలు చేయడంతో అప్పటినుంచి రోహిత్ శర్మ సారథ్యంలోనే ముంబై ఇండియన్స్ టైటిల్స్ గెలిచింది. దీంతో ఒకవేళ అప్పుడు రోహిత్ శర్మ ను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కొనుగోలు చేసి ఉంటే రోహిత్ శర్మకు కెప్టెన్ అయ్యే అవకాశం వచ్చేది కాదని. అందుకే అప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యాజమాన్యం తీసుకున్న నిర్ణయంతో ముంబై ఇండియన్స్ జట్టు కు ఎంతగానో కలిసి వచ్చిందని ఒక అద్భుతమైన కెప్టెన్ దొరకడం తో పాటు... ఐపీఎల్ లో కొత్త చరిత్ర సృష్టించడానికి కారణం అయ్యింది అని అటు ప్రేక్షకులు కూడా భావిస్తూ ఉన్నారు.