టీమిండియాకు రోహిత్ ని కెప్టెన్ చేయండి.. ఇర్ఫాన్ పఠాన్ కొత్త డిమాండ్..?
ఈ క్రమంలోనే ఇటీవలే భారత జట్టును ప్రకటించిన బిసిసిఐ రోహిత్ శర్మను సెలెక్ట్ చేయకపోవడం విమర్శలకు తావిచ్చింది. రోహిత్ శర్మ ఫిట్నెస్ లేకపోవడం కారణంగానే తాము ఆస్ట్రేలియా పర్యటన కోసం రోహిత్ శర్మ ను సెలెక్ట్ చేయలేదు అంటూ బిసిసిఐ వివరణ ఇచ్చింది. కానీ ఆ తర్వాత గంట వ్యవధిలోనే నెట్ ప్రాక్టీస్ చేస్తూ రోహిత్ శర్మ కనిపించడం ఐపీఎల్ మ్యాచ్ లో కూడా ఆడుతూ ఉండడంతో బీసీసీఐ పై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ విషయంలో కాస్త మెత్తబడిన బిసిసిఐ రోహిత్ శర్మ సెలెక్ట్ చేయబోతుంది అని టాక్ వినిపిస్తున్న విషయం తెలిసిందే.
అయితే ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా కొన్ని టెస్ట్ సిరీస్ లకు విరాట్ కోహ్లీ అందుబాటులో ఉండటం లేదు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే టెస్ట్ సిరీస్ లకు కోహ్లీ అందుబాటులో ఉండని సమయంలో రోహిత్ శర్మకు కెప్టెన్సీ బాధ్యతలను ఇవ్వాలని మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే కోహ్లీ స్థానంలో రహానే కు కెప్టెన్సీ బాధ్యతలు ఇచ్చింది బిసిసిఐ. అయితే తాను రహానేకు వ్యతిరేకం కాదని కానీ ఎంతో అనుభవమున్న రోహిత్ శర్మకు ఇస్తే బాగుంటుంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. గతంలో రోహిత్ శర్మ సారథ్యంలో టెస్ట్ సిరీస్ భారత జట్టు ఎంతో అద్భుతంగా ఆడింది అంటూ గుర్తు చేశాడు.