ఐపీఎల్ : ప్రేక్షకుల కోరిక తీరబోతుంది..?

praveen
ఈ రోజే... భారత క్రికెట్ ప్రేక్షకులు అందరూ ఎదురుచూస్తున్నది ఈ రోజు కోసమే... ఎన్నో రోజులుగా నిరీక్షణ గా కళ్ళు కాయలు కాసేలా టీవీల ముందు కూర్చొని ఎదురు చూస్తున్నది ఈ రోజు కోసమే... ఐపీఎల్ ఫైనల్ పోరు ఈ రోజే... దాదాపు రెండు నెలల నుంచి ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన ఐపీఎల్ టోర్నీ క్రికెట్ ప్రేక్షకులందరికీ ఫుల్ టైమ్ ఎంటర్టైన్మెంట్ అందించిన విషయం తెలిసిందే. ప్రతి మ్యాచ్ కూడా ఎంతో ఉత్కంఠ భరితంగా సాగింది. దాదాపు ఏడు నెలల పాటు క్రికెట్ ఎంటర్ టైన్ మెంట్ కు దూరంగా ఉన్న క్రికెట్ ప్రేక్షకులందరికీ అంతకుమించి అనే రేంజ్ లో ఎంటర్టైన్మెంట్ అందించింది ఐపీఎల్ టోర్నీ.. ఎన్నో ఘోర ఓటమి లు మరెన్నో అద్భుత విజయాలు.. ఇంకెన్నో అబ్బురపరిచే ఫీల్డింగ్ సన్నివేశాలు.. ఇక మరెన్నో విమర్శలు... ఇంకా ఎన్నో ప్రశంసలు... ఇలా ఐపీఎల్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది.




 ఇక నేటితో దాదాపు రెండు నెలల నుంచి క్రికెట్ ప్రేక్షకులందరికీ ఫుల్ టైం ఎంటర్టైన్మెంట్ అందిస్తున్న ఐపీఎల్ ముగియనుంది. ఐపీఎల్ సీజన్ లో విజేత గా ఎవరు నిలబడ పోతున్నారు అని ఎన్నో రోజుల నుంచి వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న ప్రేక్షకుల కోరిక నెరవేరనుంది.  మరికొన్ని గంటల్లో ఐపీఎల్ ఫైనల్ పోటీ ప్రారంభం కానుంది. అయితే ఈ ఏడాది ప్లే ఆప్ కి అర్హత సాధించిన మొదటి జట్టుగా రికార్డు సృష్టించిన రోహిత్ శర్మ ఆ తర్వాత మొదట ఫైనల్ లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఏడాది ఎంతో విజయవంతమైన ప్రస్థానాన్ని కొనసాగించిన ముంబై ఇండియన్స్ జట్టు మరోసారి టైటిల్ గెలిచేందుకు సిద్ధం అయ్యింది.



 ఇక ఐపీఎల్ చరిత్రలోనే మొదటిసారి ఫైనల్లోకి అడుగుపెట్టింది ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు.  ఈసారి ఎలాగైనా కప్పు గెలుచుకోవాలి అనే దృఢ సంకల్పంతో ఉంది. దీంతో నేడు గెలవబోయిది ఎవరు అన్నది అటు ప్రేక్షకుల్లో ఉత్కంఠ నెలకొంది. నేడు ఫైనల్ పోరులో తలబడ పోయె రెండు జట్లు కూడా దిగ్గజాలు కావడంతో ఏ జట్టు విజయం సాధిస్తుంది అన్నది ప్రస్తుతం ఉత్కంఠగా మారిపోయింది. అయితే ఐపీఎల్ టోర్నీలో ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మూడు సార్లు మ్యాచ్ జరగగా మూడు సార్లు కూడా విజయం సాధించింది ముంబై ఇండియన్స్. నేడు జరగబోయే మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో వేచి చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: