
డూ ఆర్ డై మ్యాచ్.. హైదరాబాద్ జట్టులో విలియమ్సన్ ఆడతాడా..?
కాగా ఇప్పటివరకు 10 మ్యాచ్లు ఆడిన రాజస్థాన్ రాయల్స్ జట్టు నాలుగు విజయాలు సాధించి ఎనిమిది పాయింట్ల పట్టికలో ఆరవ స్థానంలో కొనసాగుతోంది... ఇక తొమ్మిది మ్యాచ్ లు ఆడి మూడు విజయాలు సాధించిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఏడవ స్థానంలో కొనసాగుతోంది. ఒకవేళ నేడు రాజస్థాన్ రాయల్స్ తో జరగబోయే మ్యాచ్లో విజయం సాధిస్తే సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు పాయింట్ల పట్టిక లో 5వ స్థానానికి చేరుకునే అవకాశం ఉంటుంది. అయితే గత మూడు మ్యాచ్లలో ఓటమిపాలైన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలనే కసితో ఉంది.
అయితే సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో కీలక ఆటగాడిగా ఉన్న కేన్ విలియమ్సన్ నేడు మ్యాచ్ ఆడతాడా లేదా అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఇటీవలే కోల్కత్త తో జరిగిన మ్యాచ్ లో కేన్ విలియమ్సన్ గాయం బారిన పడిన విషయం తెలిసిందే. ఒకవేళ కేన్ విలియమ్సన్ గాయం నుంచి కోలుకోక పోతే విలియమ్సన్ స్థానంలో మొహమ్మద్ నబీ లేదా జేసన్ హోల్డర్ ఆడే అవకాశం ఉంది. అయితే రాజస్థాన్ చివరి మ్యాచ్లో విజయం సాధించి ప్రస్తుతం విజయోత్సాహంలో ఉంది. దీంతో నేడు జరగబోయే మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారిపోయింది.