ధోనిసేన మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాల్సిందే.. ఈసారి ప్లే ఆఫ్స్ కి కష్టమే..?

praveen
అసలు ధోని కి ఏమైంది... కెప్టెన్సీ లోపమా లేక  ఇంకా ఏదైనా ఉందా... చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విషయంలో ఒకటి అనుకుంటే మరొకటి జరుగుతుందేంటి... అసలు కనీసం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈసారి ప్లే ఆప్ కి వెళుతుందా.. ప్రస్తుతం అందరిలో ఇలాంటి ప్రశ్నలే తలెత్తుతున్నాయి. ప్రతి సీజన్లో ఐపీఎల్ లో అద్భుతంగా రాణిస్తూ దూసుకుపోయే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈసారి మాత్రం పూర్తిగా వెనుకబడి పోయింది. అత్యధిక విజయాలతో టాప్ ప్లేస్ లో కొనసాగే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈసారి మాత్రం ఏడు మ్యాచ్ లలో  గెలిచింది రెండు మ్యాచ్లు మాత్రమే.




 దీంతో అటు అభిమానులు అందరూ తీవ్ర నిరాశలో మునిగిపోతున్నారు. మరోవైపు క్రికెట్ విశ్లేషకులు  ధోని సారథ్యం పై ధోని ఆట పై కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్తుతం ఐపీఎల్ లో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక పలువురు మాజీలు చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్ల ఆటతీరుపై స్పందిస్తూ తమదైన శైలిలో చురకలు అంటిస్తున్నారు. అయితే ఒక సాదా సీదా టార్గెట్ ఉన్న మ్యాచ్ లలో సైతం చెన్నై సూపర్ కింగ్స్ చేతులెత్తేస్తున్న తరుణంలో ప్రస్తుతం అభిమానులు అయోమయంలో పడిపోతున్న విషయం తెలిసిందే.



 ఇక ఇటీవలే భారత మాజీ ఆటగాడు ఆకాష్ చోప్రా  చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆటతీరును పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ 2020 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్లే ఆఫ్ కి అర్హత సాధించాలి అంటే ఎంతో కష్టపడాలి అంటూ చెప్పుకొచ్చాడు ఆకాష్  చోప్రా. ఇప్పటివరకు ఆడినా 7 మ్యాచ్ లలో  కేవలం రెండుసార్లు మాత్రమే విజయం సాధించిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈసారి ప్లే ఆప్స్  కి వెళ్లాలంటే మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాల్సిందే అంటూ కామెంట్ చేశాడు. ఇకపై ఆడే ఏడు మ్యాచ్ లలో  ఏకంగా ఆరు లేదా 5 మ్యాచ్లు గెలవాల్సి ఉంది. ప్రస్తుతం చెన్నై  ఉన్న పరిస్థితుల్లో అన్ని మ్యాచులు  గెలుస్తుంది అని నేను అనుకోవడం లేదు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఆకాష్ చోప్రా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: