మా గెలుపు రహస్యం ఇదే : శ్రేయస్ అయ్యర్

praveen
ఐపీఎల్ 2020 లో ఎన్నో జట్లు టైటిల్ ఫేవరెట్ జట్లుగా రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. కానీ తక్కువ అంచనాల మధ్య  రంగంలోకి దిగి ప్రస్తుతం అందరినీ తమ ప్రతిభతో ఆశ్చర్యపరుస్తూ.. వరుస విజయాలతో దూసుకుపోతుంది ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు . మునుపెన్నడూ లేని విధంగా అద్భుతమైన ప్రతిభ  కనబరుస్తున్నారు  ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోని ప్రతి ఒక ఆటగాడు. దీంతో వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ అంటేనే ప్రత్యర్థి జట్ల కెప్టెన్లు అయోమయంలో పడే విధంగా ప్రస్తుతం ఢిల్లీ జట్టు ప్రస్థానాన్ని కొనసాగిస్తుంది. పూర్తిగా యువ ఆటగాళ్లతో నిండిన ఈ జట్టు  ప్రస్తుతం పాయింట్ల పట్టికలో టాప్  ప్లేస్ లో కొనసాగుతున్న విషయం తెలిసిందే.


 ప్రత్యర్థి జట్టు ఏదైనా సరే తమదైన వ్యూహంతో ఏకంగా వార్ వన్ సైడ్ అనే విధంగానే పరిస్థితిని మార్చేస్తున్నాడు  ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. యువ  ఆటగాడు అయినప్పటికీ తన సారథ్యంలో ఎంతో పరిణితి చూపిస్తూ దిగ్గజాలకు సైతం ఆశ్చర్య పరుస్తున్నాడు. ఇదివరకు ఐపీఎల్ లో  ఏకంగా 5 మ్యాచ్లు ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు.. నాలుగు మ్యాచ్లలో విజయం సాధించి టాప్ ప్లేస్ లో దూసుకుపోతుంది. వరుస విజయాలతో దూకుడు మీదున్న బెంగళూరు జట్టుకు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు  బ్రేక్ వేసిన విషయం తెలిసిందే. బౌలింగ్ విభాగంలో బ్యాటింగ్ విభాగంలో ఆదిపత్యాన్ని సాధించిన ఢిల్లీ జట్టు... బెంగళూరు జట్టుపై ఏకంగా 59 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

 అయితే ప్రస్తుతం వరుసగా విజయాలు అందుకుంటూ తమ జట్టు టాప్ ప్లేస్  తో నిలవడం పై ఇటీవల ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్  శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ తమ విజయ రహస్యం ఏమిటి అన్న విషయాన్ని చెప్పుకొచ్చాడు. కుర్రాళ్ళ ప్రదర్శనకు హ్యాట్సాఫ్ చెప్పిన శ్రేయస్ అయ్యర్... ఒత్తిడిని  సైతం చిత్తు చేస్తూ అద్భుతంగా పరిణతి కనబరుస్తు  ఆడుతున్నారు అంటూ ప్రశంసలు కురిపించాడు. ప్రత్యర్థి జట్టు ఏదైనా ఎంత ఒత్తిడి ఉన్నా కూడా ఎలాంటి భయం లేకుండా స్వేచ్ఛగా ఆడటమే తమ  విజయ రహస్యం టూ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ చెప్పుకొచ్చాడు. ఢిల్లీ జట్టులో ఎంతో మంది యువ ఆటగాళ్లు ఉన్నారని వారు తమ ప్రతిభను చాటుకునేందుకు ఎంతో కష్టపడుతున్నారు అంటూ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: