అంతా తూచ్ అన్న కోహ్లీ.. మద్దతిచ్చిన సచిన్..?
ఇలాంటి నేపథ్యంలో ఆటగాళ్లు బాల్ కి లాలాజలం రుద్దడం లాంటివి చేయడం నిషేధం విధించింది ఐసీసీ . ఇటీవలే జరిగిన మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు సారథి విరాట్ కోహ్లీ పొరపాటున నిబంధనలను ఉల్లంఘించాడు. ప్రస్తుతం ఇదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. మొన్నటికి మొన్న రాబిన్ ఊతప్ప ఉదంతం మరవకముందే... విరాట్ కోహ్లీ కూడా బంతికి లాలాజలం పూశాడు. ఇక విరాట్ కోహ్లీ ఐసీసీ నిబంధనలు అతిక్రమించడం హాట్ టాపిక్ గా మారిపోయింది.
నిన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు దిల్లీ క్యాపిటల్స్ జట్టుతో తల పడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలో మూడో ఓవర్ లో పృథ్వీషా బ్యాటింగ్ చేస్తుండగా... ఒక మెరుపు షాట్ కొడితే అది ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లీ వద్దకు వెళ్లింది. బంతి పట్టుకున్న విరాట్ కోహ్లీ అనుకోకుండా పొరపాటున తన లాల జలాన్ని క్రికెట్ బంతి పూశాడు. ఇక ఆ తర్వాత నిబంధనలు గుర్తుకు వచ్చిన కోహ్లీ వెంటనే తన చేయిని వెనక్కి తీసుకొని... పొరపాటున జరిగింది అన్నట్లుగా నవ్వుతూ చేతిని పైకెత్తి సిగ్నల్ ఇచ్చాడు. కాగా ఇదే విషయంపై స్పందించిన సచిన్ టెండూల్కర్... గెలిచే కసిలో అప్పుడప్పుడు ఇలాంటివి జరగడం మామూలే అంటూ తెలిపాడు.