ధోని రికార్డును బద్దలు కొట్టిన మహిళా క్రికెటర్..?
ఎందుకంటే వికెట్ల వెనకాల ఉండి వ్యూహరచన చేయడం లో... రెప్పపాటు కాలంలో బ్యాట్స్మెన్లను పెవిలియన్ పంపించడంలో ధోనీ కీపర్ గా ఎంతో సిద్ధహస్తుడు. రెప్పపాటుకాలంలో ధోనీ లాగా స్టంప్ అవుట్ చేయడం అనేది చాలా తక్కువే అని చెప్పాలి. అందుకే ధోని కీపింగ్ ప్రతిభకు అందరూ ఆశ్చర్య పోతూ ఉంటారు. కీపింగ్ లో కూడా ధోనీ ఎన్నో రికార్డులు సృష్టించారు. ఇదిలా ఉంటే ఇటీవలే ధోని కీపింగ్ రికార్డు బద్దలయింది. అది కూడా ఓ మహిళా క్రికెటర్ ధోనీ రికార్డు బద్దలు కొట్టింది.
ఆస్ట్రేలియా మహిళా జట్టు వికెట్ కీపర్ అలిస్సా హీలీ... టీమిండియా మాజీ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ రికార్డును బ్రేక్ చేసింది. ఇటీవలే న్యూజిలాండ్ తో జరిగిన రెండో టీ-20 మ్యాచ్ లో 2 క్యాచ్ లు అందుకుని... అత్యధిక మందిని అవుట్ చేసిన కీపర్ గా సరికొత్త రికార్డును నెలకొల్పింది అలిస్సా హీలీ. కాగా ఇప్పటివరకు ధోని 97 టీ-20 మ్యాచ్ లు ఆడి 57 క్యాచ్ లు 34 స్టంప్ అవుట్ లు చేసి మొత్తం 91 మందిని అవుట్ చేసిన వికెట్ కీపర్గా రికార్డు సృష్టించాడు. ఇక ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలిస్సా హీలీ 114 మ్యాచుల్లో 40 క్యాచ్ లు 52 స్టంప్ ఔట్ లు చేసి 92 మంది పెవిలియన్ చేర్చిన కీపర్గా ధోనీ రికార్డును బద్దలు కొట్టింది.