ఐపీఎల్ : అది గుర్తుంచుకోండి.. ఆటగాళ్లకు స్వీట్ వార్నింగ్ ఇచ్చిన వార్నర్..?
ముఖ్యంగా ఓపెనర్లు మంచి ప్రారంభం అందించినప్పటికీ మిడిలార్డర్లో మాత్రం బ్యాట్స్మెన్లు అదే జోష్ కొనసాగించలేక పోతుండడం జట్టును తీవ్రంగా వేధిస్తోంది. ఇక విలియమ్సన్ గాయంతో జట్టుకు దూరంగా ఉండాల్సిన పరిస్థితుల నేపథ్యంలో జట్టు మరింత కష్టాల్లోనే మ్యాచ్ లు ఆడుతుంది. ఓపెనర్ వచ్చే డేవిడ్ వార్నర్ బెయిర్ స్ట్రో మీదే పూర్తిగా ఒత్తిడి పెరిగిపోతుంది. వాళ్ళిద్దరూ అవుట్ అయ్యారు అంటే సన్రైజర్స్ విజయ అవకాశాలు క్రమక్రమంగా సన్నగిల్లి పోతున్నాయి. అయితే రెండు మ్యాచ్ల్ లలో వరుసగా ఓటమి చవి చూడటం పై సన్రైజర్స్ హైదరాబాదు జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ కాస్త అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ క్రమంలోనే జట్టు ఆటగాళ్లు అందరికీ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు డేవిడ్ వార్నర్. మనం ఉన్నది ఇండియాలో కాదని... భారత్లో ఉన్న మైదానాలను పోల్చి చూస్తే దుబాయిలో బౌండరీలు ఎంతో పెద్దవి అంటూ చెప్పుకొచ్చాడు. ఈ విషయాన్ని ప్రతి ఒక ఆటగాడు గుర్తుంచుకుంటే మంచిది అంటూ తెలిపాడు. ప్రతి మ్యాచ్ మైదానంలోకి దిగే ముందు మన మైండ్సెట్ మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని... టీ-20 ఫార్మెట్లో డిఫెన్స్ ఆడటం కాదు... వీలైనన్ని బౌండరీలు బాదేందుకు ప్రయత్నాలు చేయాలి అంటూ వార్నర్ చెప్పుకొచ్చాడు. బౌండరీలు కొట్ట లేకపోవడం వల్లే నిన్నటి మ్యాచ్ కోల్పోయాం అంటూ తెలిపాడు.