ధోని.. అది నాయకుడి లక్షణం కాదు.. చురకలేసిన గంభీర్..?

praveen
రాజస్థాన్ రాయల్స్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య హోరాహోరీ పోరు జరిగిన విషయం తెలిసిందే. చివరి బాల్ వరకు ఎంతో ఉత్కంఠ నెలకొంది. ధోని ఉన్నాడు అన్న నమ్మకంతో సీఎస్కే ప్రేక్షకులందరూ టీవీలకు అతుక్కుపోయి ఏ క్షణంలో ఏం జరుగుతుందో అని ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే అందరూ సిఎస్కె అలవోకగా గెలుస్తుంది అని నమ్మకం పెట్టుకున్నప్పటికీ... రాజస్థాన్ రాయల్స్ సాధించిన భారీ స్కోరు ముందు సీఎస్కే విలవిలలాడి పోయింది. దీంతో చివరికి 16 పరుగుల తేడాతో సీఎస్కే జట్టు ఓటమి పాలు కావలసి వచ్చింది. అయితే  సీఎస్కే జట్టు ఓటమి పాలు అవ్వడం ఏమో కానీ ధోని వ్యవహరించిన తీరుపై మాత్రం సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.



 ఎంతో గొప్ప కెప్టెన్గా పేరుతెచ్చుకున్న ధోని.. క్లిష్ట పరిస్థితుల్లో యువ ఆటగాళ్లను పంపించడం ఏంటి అని అందరూ అవాక్కయ్యారు. అయితే బ్యాటింగ్ ఆర్డర్ లో  ధోనీ వెనక్కి వెళ్లి యువ ఆటగాళ్లను పంపించడం పై భారత మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే చివరి ఓవర్లో ధోనీ బ్యాట్ జులిపించి మూడు సిక్సర్లు బాదటం  పై కూడా చురకలు అంటించాడు గౌతమ్ గంభీర్. 217 పరుగుల భారీ ఛేదన ఉన్న సమయంలో ధోని లాంటి దిగ్గజ బ్యాట్స్మెన్ ఏడవ స్థానంలో బ్యాటింగ్కు వెళ్లడం ఏంటి.. ధోని నిర్ణయం నన్ను ఎంతగానో ఆశ్చర్యపరిచింది అంటూ గౌతం గంభీర్ కామెంట్ చేశాడు.



 ధోని వెనక వచ్చే శ్యామ్ కరణ్ ఋతురాగ్  గైక్వాడ్ లాంటి తక్కువ అనుభవం గల యువ క్రికెటర్లను ముందు బ్యాటింగ్ కు పంపడం అసలు సిసలైన కెప్టెన్సీ అనిపించుకోదు... కెప్టెన్ అనే వాడు ఎప్పుడూ ముందుండి నడిపించాలి అటు చురకలు అంటించాడు గౌతమ్ గంభీర్. ఇక చివరి ఓవర్లో ధోని మూడు సిక్సర్లు కొట్టాడు... అది కేవలం అతని వ్యక్తిగత రికార్డులు కోసమే తప్ప మ్యాచ్ కోసం ఎలాంటి ఉపయోగం లేదు. వేరే బ్యాట్స్మెన్ ఎవరైనా అలా ఏడవ స్థానంలో బ్యాటింగ్ వెళ్లి నెమ్మదిగా బ్యాటింగ్ చేసి ఉంటే ఇప్పటి వరకు రచ్చ రచ్చ అయ్యేది అంటూ తెలిపిన గౌతమ్ కేవలం డుప్లెసిస్ మాత్రమే ఒంటరిగా పోరాటం చేశాడు అంటూ వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: