ధోని వీడ్కోలు.. ఇక నేను కూడా రిటైర్మెంట్ తీసుకుంటా...?
అయితే తన అభిమాన ఆటగాడు ధోని ఆగస్టు 15న రిటైర్మెంట్ ప్రకటించడం తో తాను కూడా క్రికెట్ వీక్షణకు వీడ్కోలు పలుకుతాను అంటూ చెప్పుకొచ్చాడు బషీర్. కరోనా పరిస్థితులు చక్కబడ్డాక రాంచీ వచ్చి ధోని ని కలుసుకుంటాను అని చెప్పుకొచ్చారు. ఇక మహి ఆడడు కాబట్టి మ్యాచ్ లను చూసేందుకు నేను విదేశాలకు వెళ్ళను అంటూ చెప్పుకొస్తున్నాడు ఈ అభిమాని. అయితే ఎంత గొప్ప ఆటగాడు అయిన ఏదో ఒక రోజు ముగింపు పలకాల్సిందే అని.., అతడి వీడ్కోలు నాకెన్నో మధుర స్మృతులను గుర్తుచేస్తుంది అంటూ బషీర్ చెప్పుకొచ్చాడు, కాగా అందరూ అభిమానులు కోరుకుంటున్నట్టు గానే మహి వీడ్కోలు మ్యాచ్ ఆడి ఉంటే బాగుంటుంది అని వ్యాఖ్యానించాడు బషీర్.
అయితే గతంలో చాలాసార్లు మహేంద్ర సింగ్ ధోనీ తో మాట్లాడే వాడినని తెలిపిన బషీర్... 2019 నుంచి కుదరడం లేదు అంటూ చెప్పుకొచ్చాడు, గత ప్రపంచ కప్ పోరులోనూ ధోని తనకు టికెట్ ఇప్పించడానికి గుర్తుచేసుకున్నాడు బషీర్. ధోనీ వ్యక్తిత్వానికి ఫిదా అయిపోయాను అంటూ తెలిపాడు. అయితే స్టేడియంలో ధోని కోసం చప్పట్లు కొడుతూ ఉన్నప్పుడు కొంత మంది పాకిస్తాన్ అభిమానులు తనను వెన్నుపోటు దారుడు అంటూ అవమానిస్తారని ఆవేదన వ్యక్తం చేసిన బషీర్... వాటిని పట్టించుకోను అంటూ చెప్పుకొచ్చాడు, కాగా అటు ధోని అభిమానులు కూడా ధోని రిటైర్మెంట్ పై తీవ్ర నిరాశతో ఉన్న విషయం తెలిసిందే... ధోని ఒక వీడ్కోలు మ్యాచ్ ఆడి ఉంటే బాగుండేది అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అందరు అభిమానులు.