ధోనీకే కాదు.. జెర్సీ నెం..7 కి కూడా రిటైర్ మెంట్..?
అయితే మామూలుగా భారత క్రికెట్లో ధోని అనగానే 7 నెంబర్ జెర్సీ గుర్తు వస్తుంది అన్న విషయం తెలిసిందే. ధోని లక్కీ నెంబర్ సెవెన్ కాబట్టి సెవెన్ అనే నెంబర్ జెర్సీ చూడగానే.. క్రికెట్ ప్రేక్షకులందరికీ మహేంద్ర సింగ్ ధోనీ గుర్తుకు వస్తాడు, అయితే మామూలుగా అంతర్జాతీయ క్రికెట్ లో ఒక ఆటగాడు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత అదే నెంబర్ గల జెర్సీని వేరొక ఆటగాడు ధరించేందుకు కూడా అవకాశం ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో బిసిసిఐకి టీమిండియా ఆటగాడు దినేష్ కార్తీక్ ఒక సరికొత్త డిమాండ్ ను తెరపైకి తెచ్చాడు. టీమిండియాలో ధోనీ జెర్సీ నెంబర్ 7 ను ఎంతో గౌరవించిన దినేష్ కార్తీక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అంతర్జాతీయ క్రికెట్ కు మహేంద్రసింగ్ ధోని గుడ్ బాయ్ చెప్పడంతో... ధోని 7 నెంబర్ జెర్సీ కి కూడా వీడ్కోలు పలకాలని బీసీసీఐ కి డిమాండ్ చేశాడు ఆటగాడు దినేష్ కార్తీక్. మహేంద్ర సింగ్ ధోనీ గౌరవార్థం టీమిండియా ఆటగాళ్లు ఎవరు కూడా ధోని 7 నెంబర్ జర్సీ ధరించకుండా చూడాలని బీసీసీఐని కోరాడు. కాగా ధోని బర్త్ డే ఏడో నెల 7వ తారీకు... ధోని ఎప్పటినుంచో ఏడు నెంబర్ను సెంటిమెంట్ గా ఫాలో అవుతూ వస్తున్నాడు. అయితే అటు అభిమానులు కూడా ధోని 7 నెంబర్ జెర్సీ ని ఎంతగానో గౌరవిస్తారు. అభిమానులు కూడా ఈ జెర్సీ వేరే ఆటగాళ్లకు ఇవ్వకుండా ఉండాలని ఆశిస్తున్నారు.