ఎంఎస్ ధోనీ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సౌరవ్ గంగూలీ

Suma Kallamadi

భారత క్రికెట్ కు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ గురించి బీసీసీఐ చీఫ్, భారత క్రికెట్ కు మాజీ సారధి సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతని స్థితి గురించి పూర్తి స్పష్టత ఉందని, ప్రస్తుతానికి దీనిని బహిరంగ చెప్పలేమని, త్వరలోనే అందరికీ దీనిపై స్పష్టత వస్తుందని సౌరవ్ గంగూలీ వ్యాఖ్యానించాడు. వన్డే వరల్డ్‌ కప్ ముగిశాక గత నాలుగు నెలలుగా ధోనీ క్రికెట్‌కు దూరంగా ఉంటున్న సంగతి అందరికీ తెలిసిందే. అతని స్థానంలో యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ ను పరీక్షిస్తున్నా అతను తరచూ విఫలమవుతు వచ్చాడు. ఈ క్రమంలో ధోనీ మళ్లీ మైదానంలో అడుగుపెడితే బాగుంటుందని అభిమానులు అందరూ కోరుకుంటున్నారు.

 

 

తాజాగా ధోనీ భవిష్యత్తు గురించి ఒక వార్తా సంస్థతో గంగూలీ స్పందించాడు. ధోనీ పై నిర్ణయం తీసుకోడానికి తగినంత సమయముందని, మరో మూడు నెల్లలో దీనిపై స్పష్టత వస్తుందని అన్నాడు. అంతవరకు ఏం జరుగుతుందో చూస్తూ ఉండాలని కోరాడు. మరోవైపు వచ్చే సంవత్సరం ఐపీఎల్‌ లో ధోనీ ప్రదర్శన చూశాక టీ - 20 వరల్డ్‌కప్‌ కు సంబంధించి నిర్ణయం తీసుకుంటామని భారత ప్రధాన కోచ్ రవి శాస్త్రి వ్యాఖ్యానించడాన్ని గంగూలీ కూడా సమర్థించాడు.

 

 

అయితే క్రికెట్ నుంచి చిన్న విరామం తీసుకున్న ధోనీ ఇటీవల పలు ఈవెంట్లలో పాల్గొంటున్నాడు మిస్టర్ కూల్. అలాంటి ఓ వేడుకలో పాల్గొన్నధోనీ క్రికెట్‌కు సంబంధించిన అంశాలు తనను అడుగవద్దని పేర్కొన్న సంగతి అందరికీ తెలిసిందే. మరోవైపు వచ్చే ఏడాది ఐపీఎల్ ముగిశాక ధోనీ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటాడని అతని సన్నిహితుడు ఒకరు తెలిపాడు. దీనిపై ధోనీ సమాలోచనలు చేస్తున్నట్లు తెలిపాడు. వన్డే వరల్డ్ కప్ ముగిశాక ధోనీ కొంత కాలంపాటు సైన్యంలో సేవలందించిన సంగతి తెలిసిందే. ఏది ఏమైనా భారత దేశంలోని ప్రతి ఒక్క క్రికెట్ అభిమాని కోరుకునేది ఒక్కటే అదేమిటంటే ధోని మళ్లీ పూర్వంలాగే క్రికెట్ గ్రౌండ్ లోకి తిరిగి రావాలని కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: