"సింధూ"...అలవోక విజయం..

NCR

భారత్ గర్వించ దగ్గ బ్యాడ్మింటన్ ప్లేయర్ సింధూ చైనా ఓపెన్ లో మంగళవారం చక్కని ప్రతిభ కనబరిచింది. చైనా ఓపెన్‌లో..పీవీ సింధు రెండో రౌండ్‌లోకి ప్రవేశించింది. పూర్తి ఏకపక్షంగా సాగిన పోరులో సింధు 21-13, 21-19 తేడాతో ఎవ్‌జెనీయా కోత్సెకయా(రష్యా)పై అలవోక విజయం సాధించింది. కేవలం 29 నిమిషాల్లోనే ముగిసిన పోరులో తొలి గేమ్‌ను సులువుగా దక్కించుకున్నసింధూ

 

రెండో గేమ్‌లో ఒకింత కష్టపడి ఆడాల్సి వచ్చింది..అయితే రెండో రౌండ్‌లో అన్‌సీడెడ్ బుసానన్ ఒన్బామ్రుగ్‌ఫన్(థాయ్‌లాండ్)తో సింధు తలపడుతుంది. మహిళల డబల్స్‌లో భారత ద్వయం అశ్వినీ పొనప్ప, సిక్కి రెడ్డి 21-19, 15-21, 21-17 తేడాతో జపాన్ జోడీ షిహో తనకా, కొహరు యోనోమోటోపై విజయం సాధించింది. పురుషుల డబుల్స్‌లో మను అత్రి, సుమిత్‌రెడ్డి ద్వయం ప్రత్యర్థి చేతిలో ఓటమిపాలయ్యింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: