ఆసిస్-ఇంగ్లాండ్ మ్యాచ్.. వార్న్-గంగూలి పందెం..!

shami
చాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా లండన్ లో ఓ టివి కార్యక్రమంలో పాల్గొన్నారు ఆస్ట్రేలియా మాజి క్రికెటర్ షేన్ వార్న్ ఇండియన్ మాజి కెప్టెన్ సౌరబ్ గంగూలి. ఇరు జట్ల మధ్య పోటీ రసవత్తరంగా మారుతున్న సందర్భంగా గంగూలి ఇంగ్లాండ్ గెలుస్తుందని.. షేన్ వార్న్ ఆస్ట్రేలియా గెలుస్తుందని పందెం కాశాడట.  


ఈ క్రమంలో గంగూలి ఓడితే ఆసిస్ జెర్సీ.. షేన్ వార్న్ ఓడితే ఇంగ్లాండ్ జెర్సీ ఓరోజు మొత్తం ధరించాలని పందెం పెట్టుకున్నారట. జూన్ 10న ఇంగ్లాండ్ ఆసిస్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా మీద 40 పరుగుల తేడాతో గెలిచారు. ఆస్ట్రేలియా సెమి ఫైనల్స్ నుండి కూడా వైదొలగింది. ఈ క్రమంలో ఇచ్చిన మాట ప్రకారం ఇంగ్లాండ్ జెర్సీ పంపిస్తే తాను ఓ రోజు మొత్తం ధరిస్తానని అన్నాడు షేన్ వార్న్. అంతేకాదు ఆ జెర్సీ వేసుకుని దిగిన ఫోటోలు ట్విట్టర్ లో షేర్ చేస్తానని కూడా అన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: