సౌత్ ఆఫ్రికాలో దూకుడు ఆటగాడు ఏబి డెవిలియర్స్ తన మీద వస్తున్న రిటైర్మెంట్ వార్తల మీద ఎట్టకేలకు స్పందించారు. కొద్దికాలంగా మోచేతి గాయంతో జట్టుకి దూరంగా ఉన్న డివిలియర్స్ టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు పలుకుతున్నాడని వార్తలొచ్చాయి. ఈ ఏడాదిలో జరిగే ఆస్ట్రేలియా టెస్ట్ సీరీస్లో డివిలియర్స్ టెస్ట్ కు గుడ్ బై చెప్పేస్తాడని అన్నారు. కాని తాను ఇప్పుడప్పుడే రిటైర్మెంట్ ఇచ్చేది లేదని అంటున్నాడు డివిలియర్స్.
ఇక తన లక్ష్యం దక్షిణాఫ్రికాకు వరల్డ్ కప్ తీసుకురావడమే అని అన్నారు. 2019 వరల్డ్ కప్ లో జట్టుకి అన్నివిధాలుగా కప్ తెచ్చే దిశగా ప్రయత్నాలు చేస్తామని.. వరల్డ్ కప్ తెస్తేనే కాని తాను రిటైర్మెంట్ ఇవ్వడం జరుగదని అంటున్నాడు ఏబి డివిలియర్స్. అంతేకాదు అన్ని ఫార్మెట్లను అప్పటిదాకా కొనసాగిస్తానని కూడా చెప్పాడు డివిలియర్స్.