మహర్ణవమి ప్రత్యేకం: ఆయుధపూజ వెనుక ఆసలు కథ ఇదే..!
భీకర యుద్ధం తరువాత, అమ్మవారు రాక్షసుడిని నాశనం చేసి లోకానికి శాంతిని ప్రసాదించారు. తర్వాత, దేవతలు తమ ఆయుధాలను తిరిగి స్వీకరించి, శుద్ధి చేసి, కృతజ్ఞతతో పూజించడం ప్రారంభించడంతో ఆయుధపూజ సంప్రదాయం స్థిరమైంది. ఆయుధపూజ కేవలం యుద్ధ సాధనాల కోసం మాత్రమే కాదు. ప్రతీ వృత్తి, పనిముట్లు, పరికరాలు, పుస్తకాలు, వాహనాలు కూడా ఈ రోజు దైవ సమానంగా పూజిస్తారు. ఇది మన పని పట్ల గౌరవం, నిబద్ధతను పెంపొందిస్తుంది. ప్రతి వ్యక్తి నా సాధనం శక్తివంతంగా ఉండాలి, దాని ద్వారా నేను విజయం సాధించాలి అనే భావనతో ప్రేరణ పొందతారు. ఉద్యోగులు, విద్యార్థులు, కళాకారులు ఈ పూజ ద్వారా తమ పనిని మరింత ప్రతిష్టాత్మకంగా భావిస్తారు.
ఆధ్యాత్మికంగా, మహిషాసురుడు మనలోని అరిషడ్వర్గాల (కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు) ప్రతీక. ఆయుధపూజ, విజయదశమి పండుగల అసలు సందేశం బాహ్య శత్రువుపై కాదు, అంతర్గత దుర్గుణాలపై విజయం సాధించడం. లోపలి రాక్షసుడిని జయించినప్పుడే నిజమైన జ్ఞానం, శాంతి, సంతృప్తి లభిస్తాయి. మొత్తానికి, ఆయుధపూజ కేవలం సంప్రదాయం కాదు. ఇది మన సంస్కృతిలో కృతజ్ఞత, వృత్తి గౌరవం, అంతర్గత శుద్ధి వంటి గొప్ప తత్వాలను ప్రతిబింబిస్తుంది. మహర్ణవమి రోజున ప్రతి ఇంట్లో, ప్రతి వృత్తిలో ఈ పూజ జరగటం వల్ల సంకల్ప, స్ఫూర్తి, విజయం అన్ని ప్రబలంగా ఏర్పడతాయి.