ఓహో.. కార్తీక మాసంలో దీపాలు వెలిగించడం వెనుక సైంటిఫిక్ రీజన్ కూడా ఉందా?
కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి అనేది శివరాత్రితో సమానమైన పుణ్యదినంగా పరిగణిస్తారు. అందుకే కార్తీక మాసాన్ని దేవ దీపావళి అని కూడా అంటారు. ఇక ఈ కార్తీకమాసమంతా శివాలయంలో దీపాలు వెలిగిస్తారు. ఎందుకంటే కార్తీక పౌర్ణమి శివునికి, విష్ణుమూర్తికి ప్రియమైన రోజులు. కార్తీక పౌర్ణమి రోజున దీపం వెలిగిస్తే మనం తెలిసీ తెలియక చేసిన పాపాలు కూడా తొలగిపోతాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ రోజున తెల్లవారు ఝామున నదీ స్నానం ఆచరించి, ముందు పూజ గదిలో దీపం వెలిగించి, తులసికోట దగ్గర దీపం వెలిగించిన తరువాత రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం 365 వత్తులతో దీపారాధన చేస్తారు. ఇలా 365 వత్తులతో దీపారాధన చేస్తే సంవత్సరం మొత్తం దీపారాధన చేసినటువంటి పుణ్యం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.
ఇక కార్తీకమాసంలో అగ్నిని ఆరాధన చేయడం, హోమాలు చేయడం వలన ప్రకృతిలో సమతుల్యం ఏర్పడుతుంది. తద్వారా వర్షాలు కురుస్తాయని చెబుతారు. అయితే దీని వెనకాల సైంటిఫిక్ రీజన్ కూడా లేకపోలేదు. 'దీపం అంధకార వినాశనం' తిమిర సంహారం'. అంటే చీకటిని పారద్రోలేందుకు దీపం సింబాలిగ్గా వెలిగిస్తారు. అదేవిధంగా దీపం, హోమాలు ద్వారా వెలువడిన పవిత్ర వాయువు అనేది మేఘాలతో చర్యలు నెరిపి, వర్షాలు కురవడానికి తోడ్పడుతుంది. ఇక అగ్ని స్వరూపమైనటువంటి దీపాన్ని వెలిగించి ఆరాధించడం ద్వారా అగ్ని ఆరాధన చేసినటువంటి పుణ్య ఫలితం జనాలకు లభిస్తుంది. అందుకనే ఈ మాసంలో దీపాలు వెలిగిస్తారు. అయితే సూర్యుడు ఉదయించడం కన్నా ముందే ఉదయం సంధ్య వేళలో దీపం పెడితే ఫలితం ఉంటుంది. అదేవిధంగా సాయంత్రం వేళలో సూర్యుడు అస్తమించే వేళలో సంధ్యా దీపం పెట్టాలి.