అనుకున్న ఉద్యోగం కోసం శివయ్యకు ఇలా దీపం పెట్టి చుడండి..!

Divya
చాలామంది ఎంత ట్రై చేసినా ఉద్యోగం దొరకక వారి భవిష్యత్తు ఎలా ఉంటుందో అని తెగ ఆందోళన పడుతూ ఉంటారు.వారి పక్కన ఉన్న వారు ఏ టాలెంట్ లేకపోయినా వాడికి కూడా ఉద్యోగం వస్తూ ఉంటుంది. కానీ వీరికి మాత్రం ఆడవాళ్ళ ఉద్యోగం రాకుండా అయిపోతూ ఉంటుంది.కార్తీక మాసంలో వచ్చే సోమవారం రోజున శివయ్యకు దీపం సమర్పించడం వల్ల వారి దోషాలు తొలగి వెంటనే అనుకున్న ఉద్యోగం వస్తుందని వేద పండితులు చెబుతున్నారు.అంతేకాక కుటుంబంలోని చికాకులు,నష్టాలు అన్ని తొలగి వారి కుటుంబం సంతోషంగా ఉంటుందని కూడా చెబుతున్నారు.కానీ దీపం పెట్టే సమయంలో కొన్ని ఆచారాలను పాటించడంతోనే జరుగుతుందని కూడా చెబుతున్నారు.మరి మీరు కూడా ఇలాంటి సమస్యతో బాధపడుతూ ఉన్నారా అయితే నియమాలు ఏంటో తెలుసుకుందాం పదండి..

కార్తీక మాసం అనేది శివునికి ఎంతో ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో అభిషేకాలకు కరిగిపోయే శివయ్యకు భక్తితో దీపాలు పెట్టడం చాలా మంచిది.శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు కదా.ఇది మరీ ముఖ్యంగా సోమ ఈ మాసంలో వచ్చే సోమవారం పూట చేయడం చాలా మంచి ముఖ్యం.

దీనికోసం ముందుగా ప్రతి సోమవారం ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని,ఇంట్లో పూజను ఆచరించి సంకల్పం చెప్పుకోవాలి.దీపం పెట్టడానికి ముందుగా ఐదు ఉసిరికాయలు తీసుకొని దీపం లాగా తయారు చేసుకోవాలి.ఈ ఉసిరికాయలలో నువ్వుల నూనె వేసి వత్తులు వేయాలి.ఇప్పుడు శివాలయంలో శివునికి ఎదురుగా పసుపు కుంకుమతో ఆలికి,బియ్యం పిండితో ముగ్గు వేసి,ఉసిరి దీపాలు అందులో ఉంచాలి.ఆ తర్వాత ఉప్పు వేయని పెసర పులగం చేసి నైవేద్యం శివునికి సమర్పించాలి.ఇప్పుడు మనకున్న సంకల్పం చెప్పి,శివుణ్ణి ఆరాధించాలి.ఇలా 5వారాల పాటు చేయడంతో, మీరు అనుకున్న ఉద్యోగం అందుకుంటారు.ఈ సమయంలో కచ్చితంగా దీపం సమర్పించేంత వరకు ఉపవాసం ఉండాలి.ఇలా ఉపవాసం ఉండలేము అనుకునే వారు పండ్లను తీసుకోవచ్చు.

కావున మీకు కానీ,మీ బందువులలో ఇలాంటి సమస్య ఎదుర్కొంటూ ఉంటే,ఈ పూజా విధానం ఆచరించి, శివుని కృపను పొందండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: