సాయంత్రం పూట ఈ పనులు చేశారంటే దరిద్ర దేవతలని ఆహ్వానించినట్టే..!

Divya
సాధారణంగా మన హిందూ సంప్రదాయం ప్రకారం సంధ్యా,మలిసంధ్యల్లో కొన్ని పనులు అస్సలు చేయకూడదని పెద్దలు హెచ్చరిస్తూ ఉంటారు.ఉదయం మరియు సాయంత్రం వేళ లక్ష్మీదేవి ఆగమనం జరుగుతుందని,ఆ సమయంలో కొన్ని పనులు అస్సలు చేయకూడదని,ఒక వేళ ఏమి కాదులే అని చేస్తే,దానితో దరిద్ర దేవతలను ఆహ్వానించినట్టే అని పెద్దలు చెబుతూ ఉంటారు.వారి ఆగమనం వల్ల,ఇంట్లో గొడవలు మరియు ఆర్థిక సమస్యలు మొదలవుతాయి.కావున ఎలాంటి పనులు చేయకూడదో తెలుసుకుందాం పదండి..

అప్పు..

సాయంత్రం సూర్యాస్తమయం తరువాత అసలు ఎవరికీ అప్పు ఇవ్వకూడదు,మరియు అప్పు తెచ్చుకోకూడదట.దీనివల్ల లక్ష్మీదేవికి కోపం వచ్చి,వారి ఇంట్లో మరిన్ని ఆర్థిక సమస్యలు మొదలయ్యే అవకాశాలను కలుగచేస్తుందని పెద్దలు హెచ్చరిస్తూ ఉంటారు.కావున సాయంత్రం వేళ ఎవరూ అప్పు తీసుకోవడం కానీ,ఇవ్వడం కానీ చేయకండి.

చెత్త వూడవడం..

కొన్ని శాస్ట్రాల ప్రకారం సాయంత్రం తర్వాత పొరపాటున కూడా ఇంట్లో చెత్త వుడవకూడదు.ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది.దానితో ఆ వ్యక్తి కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుంది.కొంతమంది ఒక వేళ వర్క్ చేసే వారు సమయం లేక ఇంటిని సాయంత్రం తర్వాత క్లిన్ చేయాల్సివస్తే,క్లిన్ చేసి ఆ చెత్తను ఇంటి నుండి బయట పడేయకుండా,మరుసటి రోజు ఉదయం మాత్రమే చెత్తను బయట పడెయ్యాలి.

మెయిన్ డోర్ వేయడం..

ఈ మధ్య చాలామంది ఎప్పుడు చూసినా డోర్ మూసే ఉంచుతారు.కానీ సాయంత్రం తరువాత ప్రధాన ద్వారం తలుపులు అస్సలు మూసి ఉంచకూడదు.ఆ సమయంలో లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశించే సమయం ఇదేనట,ఒక వేళ అలా మూసి ఉంచితే,లక్ష్మీదేవి ఇంట్లోకి  రాకుండా వెళ్ళిపోతుందని,ఫలితంగా ఆర్థికంగా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.

గొడవలు..

కొంతమంది తరుచూ సాయంత్రం పూట తగువులు ఆడుతుంటారు.ఇలా సూర్యాస్తమయం తర్వాత ఇంట్లో గొడవలు పడటం వల్ల క్రమంగా ఆ ఇంట్లో దరిద్ర దేవత అవహించి,పేదరికాన్ని కలగచేస్తుంది.

బిక్ష వేయడం..

ఎవరైనా బిక్షం ఎత్తుకొనే వారు ఆకలి అని మీ ఇంటి ముందుకొచ్చి,ఏదైనా కావాలని అడిగితే సాయంత్రం తర్వాత అతన్ని ఖాళీ చేతులతో అస్సలు పంపకూడదు. మన శక్తిసామర్థ్యాలకు తగిన విదంగా ఏదైనా ఇచ్చి పంపాలి.అది మనకు,మన పిల్లలకు మేలు చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: