ఏ గ్రహదోషానికి ఎటువంటి వస్తువులు దానం చేయాలో తెలుసా..?

Divya
చాలామంది ఇళ్లల్లో ఉద్యోగాలు రాక,పెళ్లిళ్లు కాక, దీర్ఘకాళిక రోగాలతో,ఆర్థిక సమస్యలతో తెగ ఇబ్బంది పడుతూ ఉంటారు.అలాంటివారికి వేదపండితులు రకరకాల దోషాలు ఉన్నాయనీ,వాటికి పరిహారం చేసుకోమని సూచిస్తూంటారు.మనకు 9నవగ్రహాలు ఉంటాయి.ఒక్కో గ్రహదోషానికి ఒక్కొక్కరకమైన ఫలితం ఉంటుంది.కానీ ఆ గ్రహదోషాలు పోగొట్టుకోవడానికి ఒక్కొక్క రకమైన వస్తువులు దానం చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయని వేదపండితులు మరియు పురాణాలు చెబుతున్నాయి.ఏ గ్రహానికి ఎటువంటి వస్తువులు దానం చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం..
కేతుగ్రహ దోషం..
కేతుగ్రహ దోషం కలవారు విపరీతమైన ఆరోగ్యసమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు.అలాంటివారు పశుపక్షా్య్దులకు ఆహారాలను దానం ఇవ్వడంతో,కేతుగ్రహం దోషం తొలగి,దీర్ఘకాళిక ఆరోగ్యసమస్యలు కూడా ఉపశమనం కలుగుతుంది. ముఖ్యంగా ఆవులకు ఉలవపొడి పెడితే,ఆ గోమాత చల్లని చూపుతో ఎటువంటి సమస్యలైనా తొలగిపోతాయి.
రవిగ్రహ దోషం..
రవిగ్రహ దోష సమస్యలు కలవారు,ఉద్యోగాలలోను, ఉద్యోగ ప్రయత్నాలలోను తెగ ఇబ్బంది పడుతూ ఉంటారు.అలాంటివారు గోధుమపిండితో తయారుచేసిన వస్తువులను ఇతరులకు దానం చేయడం వల్ల మంచి ఫలితం కలుగుతుంది.మరియు రాగులు,మిరియాలు, ఆరెంజ్ కలర్ వస్తువులను దానం చేయడంతో రవిగ్రహ దోషం పోగొట్టుకోవచ్చు.
చంద్రగ్రహ దోషం..
చంద్రగ్రహణ దోషం ఉన్నవారు ఏ పనులు అనుకున్న ఉన్నవారు సజావుగా జరగవు.అలాంటివారుతెల్లగా ఉన్న అన్నం,తెల్లని కాటన్ వస్త్రాలు,బియ్యము, పాలు,నీళ్లు,వెండి వస్తువులను దానం చేయడం వలన చంద్రగ్రహణ దోషం తొలగి,అనుకున్న పనులు సజావుగా జరుగుతాయి.
కుజగ్రహ దోషం..
కుజగ్రహ దోషం కలవారికి తొందరగా పెళ్లిళ్లు కావు. అలాంటివారు ఎర్రటి వస్తువులను,బెల్లము,పచ్చి ఖర్జూరము వంటివి బ్రాహ్మణులకు దానం చేయడం వల్ల,  కుజగ్రహ దోషాల వల్ల కలిగే సమస్యలను పోగొట్టుకోవచ్చు.
గురుగ్రహ దోషాలు..
గురుగ్రహ దోషాలు కలవారు,పసుపు రంగు బట్టలను,పండ్లను దానం చేయడం వల్ల,మంచి ఫలితాలు కలుగుతాయి.
శనిగ్రహ దోషాలు..
శనిగ్రహ దోషాలు కలవారు రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు.అలాంటివారు దాని విరుగుడు కోసం,నువ్వులు,నూనె,ఐరన్,దేవాలయాలకు సిమెంట్ వంటి వస్తువులు దానాలు చేయడం మంచిది.
రాహుగ్రహ దోషం
ఈ దోషం ఉన్నవారు బూడిదరంగు బట్టలను,ఇడ్లీలు, మినపగారెలు,సున్నుండలు వంటి వస్తువులు దానం చేయాలని చెబుతున్నారు.నానబెట్టిన మినుములు ఆవుకు పెడితే చాలా మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: